Advertisement

Advertisement


Home > Politics - Gossip

విలువల మాటెత్తే హక్కు ఎవరికీ లేదక్కడ?

విలువల మాటెత్తే హక్కు ఎవరికీ లేదక్కడ?

భాజపా-మోడీ దళం మహారాష్ట్రపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిది. అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది కేవలం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వానికి చాలినన్ని సీట్లు రాకపోయినా.. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసిన మంత్రాంగం మాత్రమే కాదు.. తమకంటూ సొంత బలాన్ని కలిగిఉన్న రెండు ప్రాంతీయ పార్టీలను చావుదెబ్బ కొట్టిన వ్యూహం. వారు కిమ్మనకుండా, అనైతికంగా భాజపా ప్రవర్తించిందని పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేకుండా అమిత్‌షా వ్యూహరచన చేసి విజయం సాధించారు.

అటు భారతీయ జనతా పార్టీకి గానీ, ఇటు ఎన్సీపీకి గానీ లేవు. ఎందుకంటే.. ఆ ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకోవడంలోనే... నైతిక విలువలు లేవు. తాము స్వయంగా విలువలను తుంగలో తొక్కేసి.. అధికారంలోకి వచ్చేసినంతగా వారు ఫీలయిపోయారు. భారతీయ జనతా పార్టీ మాత్రం మౌనం పాటించింది. ఆ మౌనానికి అర్థం ఏమిటో ఇప్పుడు బయటపడింది. వారు తాము పాటించే విలువలను పూర్తిగా వదిలేసిన తర్వాత, ఇక ఎవ్వరినీ విలువల విషయంలో ప్రశ్నించే అధికారం కోల్పోయిన తర్వాత.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తమ మ్యాజిక్ చూపించింది. శివసేన తేలుకుట్టిన దొంగలా ఉండిపోవాల్సిందే.

శరద్ పవార్ కూడా నైతికంగా అంతకంటె బలంగా ఎంతమాత్రమూ లేరు. 1978లో ఆయన అచ్చంగా ఇలాంటి వక్రమార్గంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయనకు అత్యంత కావాల్సిన వాడు అయిన.. అజిత్ పవార్ కూడా, శరద్ సిద్ధాంతాన్నే అనుసరించి.. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. 1978లో కాంగ్రెస్ శిబిరంలోనే రాత్రి వరకు ఉన్న శరద్ పవార్ తెల్లారే సరికి, ఫిరాయించి తానే ముఖ్యమంత్రి అయిన వైనం అప్పట్లో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి రాజకీయం జస్ట్ రిపీట్ అయింది.

భారతీయ  జనతా పార్టీకి అదనంగా చేకూరిన లాభం ఏంటంటే.. శరద్ పవార్ పార్టీ చీలిపోవడం. శివసేన హిందూత్వ ఎజెండాను విడిచి, కాంగ్రెస్ మీద ఆధారపడ్డందుకు ఆ రాష్ట్రంలో ఇన్నాళ్లూ వారిని అభిమానించిన ప్రజలు అసహ్యించుకునే వాతావరణం సృష్టించుకోవడం. తద్వారా.. తమ పునాదులను మరింత పటిష్టం కావడం...! కమలదళానిది తప్పుడు వ్యూహమే కానీ.. విపరీతమైన లాభాలు పొందగలిగారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?