తలైవి ఫస్ట్ లుక్ వచ్చేసింది

తమిళ రాజకీయాలను తన కనుచూపుతో శాసించిన నటి, రాజకీయ నాయకురాలు, ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ నిర్మాణంంలో వున్న సంగతి తెలిసిందే. తలైవీ పేరుతో నిర్మాణంలో వున్న జయలలిత బయోపిక్  టీజర్ అనేలాంటి విడియోను…

తమిళ రాజకీయాలను తన కనుచూపుతో శాసించిన నటి, రాజకీయ నాయకురాలు, ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ నిర్మాణంంలో వున్న సంగతి తెలిసిందే. తలైవీ పేరుతో నిర్మాణంలో వున్న జయలలిత బయోపిక్  టీజర్ అనేలాంటి విడియోను విడుదల చేసారు. 

ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోగలనని ఈ మధ్య వరుసగా నిరూపించుకుంటూ వస్తున్న కంగనా రనౌత్ ఈసారి తలైవా పాత్రలో కూడా ఇమిడిపోయినట్లే కనిపిస్తోంది. సినిమా నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో జయలలితగా కంగనా చూపించిన హావ భావాలు భలేగా వున్నాయి. అదే విధంగా రాజకీయ నాయకురాలిగా సరేసరి.

దర్శకుడు విజయ్ ఈ బయోపిక్ ను చాలా కేర్ పుల్ గా డిటైల్డ్ గా తయారుచేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎటొచ్చీ 'మీకు బాగా తెలిసిన వ్యక్తి గురించి అస్సలు తెలియని విషయాలు' అనే విధంగా ప్రకటించడమే ఆలోచింపచేసేదిగా వుంది. ఇలా అయితే తమిళనాట సినిమాకు అడ్డంకులు వస్తాయోమో? అయినా జనాలకు జయలలిత బయోపిక్ అంటే ఎంతో ఆసక్తి అయితే పక్కాగా వుంటుంది.