సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ లేటెస్ట్ ఆల్బమ్ వినిపించడం మొదలైంది. హీరో బెల్లంకొండ సాయి-డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తయారవుతున్న అల్లుడు అదుర్స్ కోసం తయారు చేసి హోలా చికా (హల్లో పిల్లా) పాట బయటకు వచ్చింది.
రెగ్యులర్ దేవీ స్టయిల్ లో క్యాచీ ట్యూన్, క్రేజీ లిరిక్స్ తో సాగిన పాట ఇన్ స్టాంట్ గా హిట్ అయ్యేలా వినిపిస్తోంది. ఈపాటను బెల్లంకొండ సాయి, నభా నటేష్ ల మీద కౌబాయ్ స్టయిల్ లో చిత్రీకరించారు.
దీని కోసం కాస్త భారీ సెట్ లే వేసారు. పాటలో హీరోయిన్ కన్నా హీరో ఎలివేషన్ కొంచెం ఎక్కువగా వుంది. డిఫరెంట్ గెటప్స్ ను హీరో మీద ట్రయ్ చేసారు.
శ్రీమణి యూత్ ఫుల్ పదాలతో లిరిక్స్ అందించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న అల్లుడు అదుర్స్ కు నిర్మాత సుబ్రహ్మణ్యం.
మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రయిలర్ కూడా రాబోతోంది. అలాగే సినిమాలో మోనాల్ ఐటమ్ సాంగ్ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల చేస్తారు.