రామతీర్ధాలుకు వచ్చి రాజకీయ రచ్చ చేసిన చంద్రబాబుకు ఇపుడు వరసపెట్టి కౌంటర్లు పడుతున్నాయి. రాముడి విగ్రహాన్ని నాశనం చేసిన వారిని ఆ రాముడే కఠినంగా శిక్షిస్తాడు అంటూ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు ఇక్కడకి వస్తే ఏంటి, వెళ్తే ఏంటి అంటూ వారు బాగానే కౌంటర్లేశారు. మరో వైపు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత మీద చంద్రబాబు చేసిన కామెంట్స్ కి సంచయిత గజపతిరాజు గట్టిగానే రిప్లై ఇచ్చారు.
మీ స్నేహితుడు మా బాబాయ్ రామతీర్ధం ట్రస్ట్ ధర్మ కర్త. అక్కడ తప్పు ఏమైనా జరిగితే బాధ్యత మీది కాదా అంటూ కడిగిపారేశారు. మహాతల్లి అని తనను వ్యంగ్యంగా సంభోదించిన చంద్రబాబుకు మహిళలను ఎలా గౌరవించాలో ఇప్పటికీ తెలియకపోవడం దారుణమంటూ సంచయిత గట్టి కౌంటర్ ఇచ్చారు.
మీలాగా దేవాలయాల కాంట్రాంక్టులు బంధువులను ఇవ్వడం నాకు తెలియదు బాబు గారూ అంటూ బాగానే సెటైర్లు వేశారు. మాన్సాస్ ఆస్తులను టీడీపీ వారికి పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన మీలాంటి చరిత్ర నాకు లేదని కూడా ఆమె గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు.
పూసపాటి వారు నిజాయతీపరులు అని మీరు అంటున్నారు. ఆ వంశీకురాలిగా నా నిజాయతీ ఏంటో పనిచేసి నిరూపించుకుంటాను అంటూ సంచయిత పేర్కొన్నారు.