అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ను తీసుకుని ఫిక్షన్ కథ అల్లుకుని, ఆర్ఆర్ఆర్ తీసారు రాజమౌళి. కానీ వాస్తవానికి అంతకన్నా ముందే అలాంటి ఐడియానే చేసాడు మరో కొత్త దర్శకుడు. అల్లూరి పాత్ర స్ఫూర్తిగా ఓ ఫిక్షన్ క్యారెక్టర్ అల్లుకున్నాడు. కానీ కోవిడ్ అడ్డం పడింది.
ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తోంది. ఆ సినిమాలో శ్రీవిష్ణు హీరో. పోలీస్ ఆఫీసర్ గా పాతికేళ్ల నుంచి నలభై ఏళ్ల స్పాన్ మధ్యలో ఈ పీరియాడిక్ సినిమా తయారవుతుంది. ఒక విధంగా ఇదో ఫిక్షనల్ బయోపిక్. ఈ సినిమాకు టైటిల్ ‘అల్లూరి’
ఈవారం విడుదలవుతోంది భళాతందనాన. చైతన్య దంతులూరి డైరక్షన్ లో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా విడుదల సందర్భంగా శ్రీవిష్ణు గ్రేట్ ఆంధ్రతో ముచ్చటించారు.ఈ సందర్భంగా తన తరువాత సినిమా విశేషాలు వెల్లడించారు.
తన నుంచి ఆడియన్స్ ఫన్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్థం అయిందని, అందువల్ల ఏ ప్రయోగం చేసినా, ఫన్ మిస్ కాకుండా చూసుకుంటున్నానని ఆయన అన్నారు.
ఒక్కోసారి తన ప్రయోగాలు విఫలమైనా, కొత్తదనంతో కూడుకున్న కథల కోసం సదా అన్వేషిస్తూనే వుంటానని, ఆ క్రమంలో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం కల్పించగలుగుతున్నాననే ఆనందం, ఆ విధంగా తన ఫ్యామిలీ పెరుగుతోందన్న తృప్తి వుందని అన్నారు. తనతో తొలిసారి పని చేసిన దర్శకులు పెద్ద స్థాయికి వెళ్తే తనకు ఆనందం అన్నారు.
భళాతందనాన మంచి సినిమా అవుతుందని, సమాజంలో చెడును చూసి ఏమీ చేయలేమా అని చాలా మంది భయపడుతూ, బాధపడుతూ వుంటారని, అలాంటి వ్యక్తికి, ఓ పట్టుదల గల జర్నలిస్ట్ తోడయితే ఏం చేయడగలిగాడు అన్నది సినిమా అని ఆయన అన్నారు. సినిమాలో ఫన్ కూడా అంతర్లీనంగా వుంటుందని, సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుందని అన్నారు.
పెద్ద బ్యానర్లలో చేస్తే కలిగే సౌలభ్యం, సదుపాయాలు ఇప్పుడిప్పుడే తెలిసి వచ్చాయని, రాబోయే సినిమాలు చాలా వరకు పెద్ద బ్యానర్లలోనే అని శ్రీవిష్ణు చెప్పారు. మల్టీ స్టారర్ లు చేయాలనే వుందని, అలాంటి అవకాశాల కోసం చూస్తున్నా అని అన్నారు. తన మిత్రుడు నారా రోహిత్ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తున్నాడని, త్వరలో మళ్లీ సినిమాల్లోకి వస్తాడని చెప్పారు.
రోహిత్ కు సినిమాలంటే చాలా ఇష్టం అని, అందువల్ల ఈ రంగాన్ని వదిలేయడని అన్నారు. రాజకీయాలు రొహిత్ లాంటి మంచివాళ్లకు సరిపడవు అన్నది తన అభిప్రాయమని శ్రీవిష్ణు అన్నారు.