కూతురి పెళ్లి తేదీ ప్రకటించిన అమీర్ ఖాన్

హీరో అమీర్ ఖాన్ త్వరలోనే తన కూతురికి పెళ్లి చేయబోతున్నాడు. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని తాజాగా అమీర్ ప్రకటించాడు. తన కూతురు ఇరా ఖాన్ కు వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి చేయబోతున్నట్టు…

హీరో అమీర్ ఖాన్ త్వరలోనే తన కూతురికి పెళ్లి చేయబోతున్నాడు. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని తాజాగా అమీర్ ప్రకటించాడు. తన కూతురు ఇరా ఖాన్ కు వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి చేయబోతున్నట్టు ప్రకటించాడు ఈ నటుడు.

అమీర్ కూతురు ఇరా ఖాన్, నుపురు శిఖర్ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి తీసుకొని, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.

తాజాగా ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన అమీర్ ఖాన్, ఈ ఏడాది చివర్లో కూతురు పెళ్లి జరగబోతోందంటూ వస్తున్న వార్తల్ని ఖండించాడు. ఇరా ఖాన్ పెళ్లి, వచ్చే ఏడాదిలో జరుగుతుందని స్పష్టం చేశాడు. తనకు మంచి అల్లుడు దొరికాడని ఈ సందర్భంగా శిఖర్ ను మెచ్చుకున్నాడు.

కొన్నాళ్ల కిందట తీవ్రమైన డిప్రెషన్ తో ఇబ్బందిపడిందట ఇరా ఖాన్. ఆ సమయంలో నుపుర్ శిఖర్, ఆమెకు అండగా నిలిచాడట. స్వతహాగా అతడో ట్రయినర్ కూడా కావడంతో.. ఇరా ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా సాయం అందించాడట. అప్పట్నుంచి ఇద్దరూ చాల్ క్లోజ్ అయ్యారనే విషయాన్ని స్వయంగా అమీర్ ప్రకటించడం విశేషం.

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్. వీళ్లిద్దరి కుమార్తె ఇరా ఖాన్. ఆమెకు అన్నయ్య జునైద్ ఖాన్ కూడా ఉన్నాడు.