కూలీ లో.. అమీర్ ఖాన్ కూడా!

లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న సినిమా నాగార్జున, రానా, ఉపేంద్ర, సత్యరాజ్, ఇలా చాలా మంది కీలక నటులు వున్నారు. అమీర్ ఖాన్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల నటులు వుంటే అదో అందం. ఈ విషయాన్ని రాజమౌళి ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా అదే దారిలో వెళ్తున్నారు.

జైలర్ సినిమాకు రజనీ మరో అడుగు ముందుకు వేసి, తనకు వున్న పరిచయాలు వాడి ప్రతి లాంగ్వేజ్ సూపర్ స్టార్ లను కామియో పాత్రల్లో నటింపచేసారు. ఇప్పుడు ఆయనే మరో అడుగు ముందు వేసారు.

లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న సినిమా నాగార్జున, రానా, ఉపేంద్ర, సత్యరాజ్, ఇలా చాలా మంది కీలక నటులు వున్నారు. అమీర్ ఖాన్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజం అయ్యాయి. నిన్న, మొన్న ముంబాయిలో అమీర్ పాల్గొన్న సీన్లు కొన్ని చిత్రీకరించారు.

రజనీ అడగాలే కానీ ఎవరైనా నటిస్తారు. ఇంకా మరి కొంత మంది పేర్లు త్వరలో బయటకు రావచ్చు. నాగార్జున, రానా మాత్రం కామియోలు కాదు. ఫుల్ లెంగ్త్ పాత్రలు ధరిస్తున్నారు.

7 Replies to “కూలీ లో.. అమీర్ ఖాన్ కూడా!”

      1. అతను స్టార్ స్టేటస్ ఉన్న హీరో కాడు అన్నానండీ! రానా కుటుంబ నేపథ్యం కూడా తక్కువేమీ కాదుగా.. చిరంజీవి తొక్కితే నాశనమై పోవడానికి.

Comments are closed.