పవన్.. పిఠాపురం.. ఎనిమిది రోజులు?

అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో పవన్ ఆ నియోజకవర్గంలో గడిపిన సమయం మొత్తం ఎనిమిది రోజులు మాత్రమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి.

పిఠాపురం వాసులు అద్భుతమైన మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ని. కానీ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో పవన్ ఆ నియోజకవర్గంలో గడిపిన సమయం మొత్తం ఎనిమిది రోజులు మాత్రమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి.

చంద్రబాబు సీఎం. అందువల్ల కుప్పంలో సదా ఉండలేరు. లోకేష్ మంత్రి. వీలైనంతగా నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. పవన్ కూడా మంత్రే. మూడు శాఖలకు. డిప్యూటీ సీఎం అన్నది కేవలం హోదా మాత్రమే అని ఇక్కడ గమనించాలి. మరి అలాంటపుడు పవన్ కూడా తన నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలి కదా.

ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. గెలిచిన కొత్తలో ఇక్కడ అన్ని ఎకరాలు కొన్నారు. ఇన్ని ఎకరాలు కొన్నారు. ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడే ఉంటారు అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం పిఠాపురంలో ఇన్ చార్జి పాలన సాగుతోంది తప్ప పవన్ రావడం లేదు.

పవన్ వస్తేనే పనులు జరుగుతాయా? అంటే “హౌ” అనే చెప్పాలి. పవన్ పిఠాపురంలోనే ఉంటే అధికారులు అన్నింటి మీదా శ్రద్ధ పెడతారు. రోడ్లు, శుభ్రత, ట్రాఫిక్ ఇలా ఒక్కటి కాదు అన్నింటి మీదా దృష్టి పెడతారు. అదే ఎమ్మెల్యే లోకల్‌గా ఉండరు అనే భావన వస్తే అధికారుల పని తీరు కూడా అలాగే ఉంటుంది.

సాధారణంగా జనం నిత్యం ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్తారు. వాళ్లతో టచ్‌లో ఉంటారు. తమ సమస్యలు చెప్పుకుంటారు. ఇప్పుడు అలా చెప్పుకోడానికి పవన్ లేరు. ఇన్ చార్జితోనే చెప్పుకోవాల్సి వస్తోంది.

20 Replies to “పవన్.. పిఠాపురం.. ఎనిమిది రోజులు?”

  1. పిఠాపురం లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కడుపు మంట తో కుళ్లు కుంటున్నావా GA…..

Comments are closed.