నేను జోక్ చేశాను.. సరదాగా తీసుకోండి

తను కేవలం జోక్ చేశానని, దాన్ని జోక్ గా మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాడు.

“టాలీవుడ్ లో తెలుగొచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. తెలుగొచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసొచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే ఎంకరేజ్ చేయాలని నేను, నా డైరక్టర్ సాయిరాజేష్ నిర్ణయించుకున్నాం.”

రీసెంట్ గా జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో నిర్మాత ఎస్.కే.ఎన్ చేసిన సీరియస్ కామెంట్స్ ఇవి. దీనిపై రకరకాల కథనాలు, విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ నిర్మాత. తను జోక్ చేశానని అంటున్నాడు. సరదాగా చెప్పిన ఆ జోక్ ను ఓ స్టేట్ మెంట్ గా మార్చేయొద్దని కోరుతున్నాడు.

తన కెరీర్ లో 80 శాతం మంది తెలుగమ్మాయిలతోనే పనిచేశానని చెప్పుకొచ్చిన ఎస్.కె.ఎన్. 25 మంది తెలుగమ్మాయిల్ని వివిధ విభాగాల్లో పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపాడు.

తెలుగమ్మాయిల్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని అంటున్న ఈ నిర్మాత, తను కేవలం జోక్ చేశానని, దాన్ని జోక్ గా మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాడు. ఇకపై కూడా తన తొలి ప్రాధాన్యం తెలుగమ్మాయిలకే ఇస్తానని వాగ్దానం చేశాడు.

6 Replies to “నేను జోక్ చేశాను.. సరదాగా తీసుకోండి”

Comments are closed.