టాలీవుడ్ హీరో రవితేజ సరసన హీరోయిన్‌గా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అయితే ముగ్గురు హీరోయిన్లలో ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేసుకోగా, మూడో భామగా అనసూయను ఎంపిక చేసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
రవితేజ నటించిన క్రాక్ సినిమా త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మరో కొత్త సినిమాకు రవితేజ అంగీకరించారు. ఖిలాడీ టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సినిమా తీయనున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు హల్‌చల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిని హీరోయిన్లగా ఎంపిక చేసుకున్నారు. ఇక మూడో హీరోయిన్‌గా హాట్ యాంకర్, నటి అనసూయను ఎంపిక చేసుకున్నారని సమాచారం.
అనసూయకు సినిమాల్లో నటించడం కొత్తకాదు. ఆల్రెడీ రంగస్థలంలో తనకిచ్చిన పాత్రలో ఇరగదీశారనే పేరు తెచ్చుకున్నారు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం చిత్రాల్లో కూడా తన నటనతో అభిమానులను మెప్పించారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే నటనా చాతుర్యం అనసూయ సొంతం.
ఈ నేపథ్యంలో రవితేజ తాజా చిత్రంలో అనసూయ అగ్రహారపు బ్రాహ్మణ యువతిగా కనిపించనుందని కృష్ణానగర్ టాక్. అంతేకాదు, అనసూయ పాత్ర విభిన్నంగా ఉందని అంటున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఖిలాడీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.