అనసూయ…పెద్ద..అనుమానం

యాంకర్, నటి అనసూయ కూడా మా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఆమె  పోటీకి దిగారు. Advertisement నిన్నటికి నిన్న ఆమె మంచి మెజారిటీతో గెలుపొందినట్లు…

యాంకర్, నటి అనసూయ కూడా మా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఆమె  పోటీకి దిగారు.

నిన్నటికి నిన్న ఆమె మంచి మెజారిటీతో గెలుపొందినట్లు వార్తలు వచ్చాయి. కానీ గమ్మత్తేమిటంటే ఫైనల్ ఫలితం ఈ రోజు ప్రకటించారు. ఆమె ఓడిపోయినట్లు ప్రకటించారు.

దీనిపై అనసూయ సోషల్ మీడియాలో స్పందించారు. నిన్న రాత్రి..అలా ఇవ్వాళ ఇలా..దీని వెనుక ఏం జరిగిందో అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసారు. బ్యాలట్ పత్రాలను నిన్న రాత్రి ఇళ్లకు తీసుకెళ్లారని బయట టాక్ వినిపిస్తోందని ఆమె వెల్లడించారు. 

టాక్ అంటూనే అనసూయ రాత్రికి రాత్రి ఏదో గోల్ మాల్ జరిగిందనే అనుమానం వ్యక్తం చేసారు. నిజానికి ఇది చిన్న అనుమానం కాదు. చాలా పెద్ద అనుమానమే. 

ఇప్పుడు ఇక తీగ పట్టుకుని ఎవ్వరూ డొంక కదల్చకపోయినా, ఇక సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అయితే రెడీ అవుతాయి. అది మాత్రం గ్యారంటీ.