హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ అనుభవాలుంటాయనుకుంటే పొరపాటే. ఈ బాధితుల్లో యాంకర్లు కూడా ఉంటారు. అందంగా కనిపిస్తే చాలు రాత్రికొస్తావా అని అడిగే వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడీ బాధితుల లిస్ట్ లోకి హాట్ యాంకర్ వర్షిణి కూడా చేరిపోయింది.
కొన్ని సూపర్ హిట్ షోస్ తో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న వర్షిణి.. తను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు బయటపెట్టింది. తన జీవితంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకం అదొక్కటే అంటోంది ఈ ముద్దుగుమ్మ.
“ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. రమ్మంటే వెళ్లి దర్శకుడ్ని కలిశాను. కాసేపు నాతో మాట్లాడాడు. కొద్దిసేపటికి నాతో మిస్-బిహేవ్ చేశాడు. ఇది రీసెంట్ గానే జరిగింది. లాక్ డౌన్ కు ముందు నాకు ఇది ఎదురైంది. అతడు నా చేయి పట్టుకొని లాగాడు. నేను వెంటనే బయటకొచ్చేశాను. కారులో కూర్చొని ఏడ్చాను. నా కెరీర్ లో చేదు అనుభవం ఇదొక్కటే. ఎప్పడూ నాకు అలా జరగలేదు.”
అప్పట్లో తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని తన తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేకపోయానని, కేవలం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రం షేర్ చేసుకొని ఏడ్చానని బాధపడింది వర్షిణి. తమిళనాడులో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.