అతగాడో యాక్టివ్ యాంకర్. ఫిమేల్ సామ్రాజ్యమైన యాంకరింగ్ ఫీల్డ్ లో మగ మహారాజు. ఇతగాడిపై వచ్చినన్ని గ్యాసిప్ లు సినిమా జనాల మీద కూడా రాలేదు.
ఒక పెద్ద ఫ్యామిలీ అమ్మాయితో మాంచి సన్నిహిత స్నేహం వుండేదని కూడా గుసగుసలు వున్నాయి. ఆ అమ్మాయితో కలిసి గోవాలో వుండగా చూసిన జనాలు ప్యామిలీకి హింట్ ఇవ్వడంతో అక్కడ బ్రేక్ పడిందని టాక్.
ఆ తరువాత చాలా గ్యాసిప్ లు వినిపించేవి. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా వుంది అనుకుంటే కొత్తగా లివింగ్ టు గెదర్ మొదలుపెట్టారంటూ గ్యాసిప్ వినిపిస్తోంది. ఈసారి ఎవరా అమ్మడు అన్నది క్లారిటీగా తెలియడం లేదు కానీ, ఇప్పటికే పెళ్లయి, డివోర్స్ అయిన అమ్మాయి అని మాత్రం వినిపిస్తోంది.
ఈసారి మరి లివింగ్ టు గెదర్ యేనా? లేక పెళ్లి వరకు వెళ్తుందా? అన్నది చూడాలి. ఏమిటో, టాలీవుడ్ లో ముదర బెండకాయలు పెరిగిపోతున్నాయి. ఎంత డబ్బున్నా, ఫేరున్నా పెళ్లిళ్లు మాత్రం కావడం లేదు.