అక్టోబర్ 13..ఇప్పుడు ఈ డేట్ టాలీవుడ్ పెద్ద సినిమాల హాట్ ఫేవరెట్ గా మారింది. వీలైతే ఆ డేట్ ను స్వంతం చేసుకోవాలని చాలా సినిమాలు ఆలోచిస్తున్నాయి. ఈ డేట్ ను రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ రిజర్వ్ చేసుకుంది. ఒక వేళ ఆర్ఆర్ఆర్ రాకపోతే తమ సినిమా వేయాలనే ఆలోచనలో మెగాస్టార్ 'ఆచార్య' యూనిట్ వుంది.
ఆ రెండు సినిమాలు కాకుంటే తమ సినిమాను వేయాలనే ఆలోచన బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లోని 'పుష్ప' నిర్మాతలకూ వుంది. ఆ రోజుకు రెడీ కావడం అన్నది కాస్త టైట్ పొజిషనే కానీ, వస్తే బాగానే వుంటుందన్నది బాహుబలి ప్రభాస్ తో తయారు అవుతున్న 'రాధేశ్యామ్' యూనిట్ కొరిక.
ఇంతకీ ఈ డేట్ మీద ఎందుకింత మక్కువ అంటే. దసరా సీజన్ అన్నది ఒక కీలకమైన కారణం. రెండవది అలాంటి సీజన్ మళ్లీ రావాలంటే కనీసం మరో మూడు నెలలు వెయిట్ చేసి సంక్రాంతికి వెళ్లాల్సి వుంటుంది. అప్పుడు పోటీ తక్కువేమీ లేదు. సర్కారు వారి పాట, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్, ఎఫ్ 3 లాంటి సినిమాలు వుండనే వుంటాయి.
మొత్తానికి ఒకటి మాత్రం క్లారిటీ. అక్టోబర్ 13 కు ఏదో ఒక భారీ సినిమా అయితే తెరమీదకు వస్తుంది. మెజారిటీ సినిమా అభిమానులను ఊపేస్తుంది.