డేటింగ్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. హీరోయిన్ల విషయంలో ఇక చెప్పనక్కర్లేదు. అయితే డేటింగ్ పై ఒక్కో హీరోయిన్ కు ఒక్కో అభిప్రాయం ఉంది. మరీ ముఖ్యంగా డేటింగ్ ప్రారంభించిన మొదటి రోజే మూతి ముద్దు పెడితే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కు ఎదురైంది.
ఎవరితోనైనా డేటింగ్ చేస్తే మొదటి రోజే లిప్ కిస్ పెడతారా అనే ప్రశ్నకు ప్రగ్యా జైశ్వాల్ నో చెప్పింది. మొదటి రోజే ముద్దు పెట్టడం తనకు ఇష్టం ఉండదని, కొన్ని రోజుల తర్వాత, మనసులు కలిసిన తర్వాత లిప్ కిస్ పెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది.
లాక్ డౌన్ తర్వాత తొలిసారి సినిమా సెట్స్ పై అడుగుపెట్టింది ప్రగ్యా. బాలకృష్ణతో కలిసి అఖండ సినిమా చేస్తోంది. సెకెండ్ వేవ్ తర్వాత తొలిసారి సెట్స్ పైకి వచ్చినప్పుడు చాలా భయం వేసిందని, కానీ కెమెరా ముందుకెళ్లిన తర్వాత అన్నీ మరిచిపోయానంటోంది.
“సెట్స్ లో ఒకేసారి 200 మందిని చూస్తే భయమేస్తోంది. అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు కానీ మనసులో ఏదో భయం. అయితే ఎప్పుడైతే షూటింగ్ వాతావరణంలోకి పూర్తిగా వెళ్లిపోతామో, అప్పుడిక కరోనా ఉందనే విషయాన్నే మరిచిపోతున్నాను. ఒక్కసారి షాట్ ఓకే అయి, కుర్చీలో కూర్చున్న తర్వాత మాత్రమే కరోనా ఉందనే విషయం గుర్తొచ్చి మళ్లీ భయమేస్తోంది.”
ప్రగ్యాకు టూర్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు కవర్ చేసింది. త్వరలోనే తనకు ఎంతో ఇష్టమైన బాలికి వెళ్తానంటోంది. అక్కడ స్కూబా డైవింగ్ చేయడం తనకు ఇష్టమంటోంది ఈ చిన్నది.