Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆంధ్ర 30...నైజాం 30

ఆంధ్ర 30...నైజాం 30

హీరోలు, నటుల రెమ్యూనిరేషన్లు పెరిగిపోతున్నాయి. డిజిటల్ ఆదాయం పెరిగింది. థియేటర్, శాటిలైట్ ఆదాయం తగ్గింది. నిర్మాణ వ్యయం రాబట్టుకోవడానికి ఆంధ్ర 50 కోట్లు నైజాం 36 కోట్లు అమ్మడం అన్నది అలవాటైపోతోంది. కానీ ఈ ఫీట్ ను అందుకోవడానికి సినిమాలు కిందా మీదా అవుతున్నాయి.

యావరేజ్ గా చూసుకుంటే ఆంధ్ర 30 కోట్లు,  నైజాం 30 కోట్లు, సీడెడ్ 10 కోట్లు తెచ్చుకోవడం అన్నది పెద్ద సినిమాలకు సులువుగా కనిపిస్తోంది అది కూడా టాక్ యావరేజ్ గా వున్నా కూడా. కానీ సినిమా వ్యయం 130 నుంచి 160 కోట్లకు డేకేస్తుండడంతో ఈ మొత్తాలతో నిర్మాతలు సరిపెట్టుకోలేకపోతున్నారు. 

ఆంధ్రలో, నైజాంలో బయ్యర్లు సేఫ్ గా వుండాలంటే ఇక్కడ అక్కడ కూడా 30 నుంచి 35 కోట్ల రేంజ్ లో రేట్లు వుంటే బెటర్ అన్నది టాలీవుడ్ సీనియర్ల అభిప్రాయం. పుష్ప, భీమ్లా నాయక్, సర్కారువారిపాట సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. కానీ నిర్మాతల చేతిలో ఏమీ మిగలడం లేదు.

పెద్ద హీరోలు యాభై నుంచి అరవై  కోట్లు రెమ్యూనిరేషన్ గా ఎప్పుడయితే లాగేస్తున్నారు. ప్రొడక్షన్ కు 80 నుంచి తొంభై కోట్లు ఖర్చు అవుతోంది. దాంతో నిర్మాతలకు ఏమీ మిగలడం లేదు. పైకి చెప్పకున్నా పెద్ద పెద్ద సినిమా గత ఆరేడునెలల్లో విడుదల చేసిన పెద్ద నిర్మాతలకు తెలుసు తమకు మిగిలింది ఏమిటో?

ఇప్పటికైనా ఈ పద్దతి మారకపోతే ఆంధ్రలో కొన్నాళ్లకు బయ్యర్లు అనే వాళ్లు లేకుండా పోయే ప్రమాదం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?