Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ్యాన్ వార్ కు కళ్లెం వేయాల్సిందే

ఫ్యాన్ వార్ కు కళ్లెం వేయాల్సిందే

సినిమా భవిష్యత్ సోషల్ మీడియా చేతుల్లోకి వెళ్లిపోతోంది. మీడియా కూడా తన అభిప్రాయాల ప్రచారానికి సోషల్ మీడియానే నమ్ముకుంది. విజువల్, ప్రింట్, వెబ్ ఏ మీడియా అయినా సోషల్ మీడియా ద్వారానే జనాలకు దగ్గర కావాలని చూస్తున్నాయి. అంతే తప్ప జనం నేరుగా వీటి దగ్గరకు రప్పించుకోవాలని చూస్తున్నట్లు లేదు. 

ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్, వాట్సాప్ అన్నవి కీలక ప్రచార సాధనాలుగా మారిపోతున్నాయి. దాంతో సినిమా భవిష్యత్ మొత్తం వీటి మీదే ఆధారం అయిపోతోంది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఫేక్ అక్కౌంట్లు. ఈ ఫేక్ అక్కౌంట్లు వంద, రెండు వందలు వుంటాయో, మహా అయితే వెయ్యి వుంటాయో, కానీ వీటిదే రాజ్యం అయిపోతోంది. సినిమాను ట్రోల్ చేసినా, వ్యక్తులను ట్రోల్ చేసినా, ప్రొడెక్ట్ మంచి చెడ్డలు డిసైడ్ చేసినా అంతా ఈ ఫేక్ అక్కౌంట్లే. 

వీటివల్ల ఏం జరుగుతుందీ అనుకుంటే పొరపాటే. అర్బన్ ఆడియన్స్ ను ఇవే ప్రభావితం చేస్తున్నాయి. ముందుగానే హ్యాష్ ట్యాగ్ లు రెడీ అయిపోతున్నాయి. సినిమా పడకముందే ట్రోలింగ్ లు మొదలైపోతున్నాయి. గమ్మత్తేమిటంటే ఇక్కడ కూడా కులాలు చాలా వరకు కీలక పాత్ర వహిస్తున్నాయి. 

కొంత చిత్రమైన కొత్త అక్కౌంట్లు కూడా ఈ మధ్య పురుడుపోసుకున్నాయి. వీళ్లు నిజానికి ఎవరి ఫ్యాన్స్ కాదు. మహేష్ ఫోటో పెట్టుకుని పవన్ ను టార్గెట్ చేస్తారు. పవన్ ఫొటొ పెట్టుకుని మహేష్ ను టార్గెట్ చేస్తారు. దీని వల్ల ఫ్యాన్స్ పోరులో ఆజ్యం పోసినట్లు అవుతోంది.

ఆర్ఆర్ఆర్ టైమ్ లో ఎన్టీఆర్ బలయితే దానికి బదులుగా ఆచార్య సినిమా బలయింది. ఆ కోపం సర్కారు పాలిట శాపంగా మారింది.  ఒకప్పుడు యావరేజ్ సినిమాను కాస్త పుష్ చేస్తే బ్రేక్ ఈవెన్ కు వెళ్లేది. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాను తెల్లవారు ఝాము నుంచే సోషల్ మీడియా అస్త్రాలతో చంపేస్తున్నారు. యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప సినిమా బతికే చాన్స్ లేదు ఇప్పుడు. 

ఫ్యాన్స్ ను పెంచి పోషించడం వరకు బాగానే వుంది. ఆ ఫ్యాన్స్ అవతలి హీరోలను టార్గెట్ చేసినపుడు బాగానే వుంది. కానీ అవతలి ఫ్యాన్స్ తమ సినిమాను మోసి అవతల పారేసినపుడు తెలుస్తోంది నొప్పి. ఇప్పటికైనా పెద్ద హీరోలు అందరూ కలిసి ఈ ఫ్యాన్స్ వార్ లకు తెరదించాలి. లేదూ అంటే ఆర్ఆర్ఆర్ నుంచి ఆచార్య మీదుగా సర్కారు కు చేరిన ఈ యుద్దం రేపు మరో మెగా సినిమా కోసం వేచి వుంటుంది. ఆపై మరో ఈ పక్క హీరో మీదకు విల్లు ఎక్కుపెడుతుంది. 

దీనివల్ల హీరోల సంగతేమో కానీ నిర్మాతలు గుల్లయిపోతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?