అనిల్-బాలయ్య ఫిక్స్

అనిల్ రావిపూడి తరువాత సినిమా దాదాపు అధికారికంగా ఫిక్స్ అయిపోయినట్లే. గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తున్న ఈ సినిమా పక్కాగా వుంటుందని హీరో బాలయ్య నే చెప్పినట్లు బోగట్టా.   Advertisement నిన్నటికి నిన్నబాలయ్య తన…

అనిల్ రావిపూడి తరువాత సినిమా దాదాపు అధికారికంగా ఫిక్స్ అయిపోయినట్లే. గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తున్న ఈ సినిమా పక్కాగా వుంటుందని హీరో బాలయ్య నే చెప్పినట్లు బోగట్టా.  

నిన్నటికి నిన్నబాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా పలువురు ఫ్యాన్స్ తో జూమ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలయ్య తన తరువాత ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీస్ తో సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా వుంటుందని క్లారిటీ ఇచ్చేసారు బాలయ్య. నిర్మాత సాహు ఈ సినిమాను నిర్మిస్తారు. 

ఎఫ్ 3 తరువాత అనిల్ రావిపూడి ఈ సినిమా మీదకు వస్తారన్నమాట. బాలయ్య కూడా గోపీచంద్ మలినేని సినిమా ఫినిష్ చేసి అప్పుడు ఈ సినిమా మీదకు వస్తారు.