రాజమౌళి బాటలో రావిపూడి

ఎవరితో చేస్తానో తెలియదు కానీ నాకూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా ఓ మైథలాజికల్ సినిమా చేయాలని ఉంది.

రాజమౌళిని, అనీల్ రావిపూడిని కంపేర్ చేసి చూడలేం. రాజమౌళి మేకింగ్ స్టయిల్ వేరు, అనీల్ రావిపూడి శైలి వేరు. సినిమా కోసం ఒకరు మూడేళ్లు టైమ్ తీసుకుంటే, మరొకరు చకచకా పూర్తిచేస్తారు. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం రాజమౌళి-రావిపూడి మధ్య సారూప్యత కనిపిస్తోంది. అదే డ్రీమ్ ప్రాజెక్టు.

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటనేది అందరికీ తెలిసిందే. మహాభారతాన్ని సినిమాగా తీయాలనేది ఆయన కల. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానంటున్నాడాయన. అనీల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే.

“ఎవరితో చేస్తానో తెలియదు కానీ నాకూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా ఓ మైథలాజికల్ సినిమా చేయాలని ఉంది. మహాభారతం నుంచి ఏదో ఒక బ్లాక్ పట్టుకొని ఓ సినిమా చేయాలని ఉంది. ఎప్పుడు చేస్తానో తెలియదు.”

రాజమౌళి టోటల్ మహాభారతాన్నే సినిమాగా తీయాలని భావిస్తుంటే.. అనీల్ రావిపూడి మాత్రం మహాభారతంలో ఏదైనా మంచి బ్లాక్ తో సినిమా చేయాలనేది తన డ్రీమ్ ప్రాజెక్టుగా బయటపెట్టాడు.

తను కథలు రాసి హీరోల కోసం ప్రయత్నించనని, హీరో సెట్ అయిన తర్వాత ఆయన ఇమేజ్ కు తగ్గట్టు కథ రాస్తానని అంటున్నాడు ఈ దర్శకుడు. చిరంజీవితో సినిమా ఓకే అయింది కాబట్టి, ఆయన కోసం కథ రాస్తున్నట్టు, అది దాదాపు పూర్తయినట్టు చెప్పుకొచ్చాడు అనీల్ రావిపూడి.

6 Replies to “రాజమౌళి బాటలో రావిపూడి”

  1. Baboy chiru sir thota? Fate turn ki chances rkuva…chiru sir, movie naturality ni patichukoru ..he only follpws his commertial formula…that too 1980s formula

Comments are closed.