ఫిబ్రవరి బాక్సాఫీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల సందడి ముగుస్తుంది. సమ్మర్ సినిమాల చర్చ మొదలవుతుంది. ఈ సంధి కాలంలో ఉంటుంది ఫిబ్రవరి బాక్సాఫీస్. అయినప్పటికీ ఈ నెలలో ఏటా కచ్చితంగా ఓ సక్సెస్ వస్తోంది.
2023 ఫిబ్రవరినే తీసుకుంటే సర్ సినిమా ఊహించని విజయాన్నందుకుంది. ఇక 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లూ, 2021 ఫిబ్రవరిలో ఉప్పెన, 2020 ఫిబ్రవరిలో భీష్మ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. గతేడాది ఊరు పేరు భైరవకోన సినిమా మెప్పించింది. ఇలా ప్రతి ఏడాది ఫిబ్రవరికి ఓ సక్సెస్ పడుతోంది. మరి ఈ ఫిబ్రవరి సంగతేంటి? ఆ సెంటిమెంట్ రిపీట్ అయిందా?
మొదటి వారంలో వచ్చిన తండేల్ సినిమా, ఫిబ్రవరి సెంటిమెంట్ ను రిపీట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సక్సెస్ అయింది. నాగచైతన్య కెరీర్ లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కంటే ఒక రోజు ముందొచ్చిన పట్టుదల మూవీ ఫ్లాప్ అయింది.
రెండో వారంలో.. లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలొచ్చాయి. విశ్వక్ సేన్ హీరోగా వాలంటైన్స్ డే కానుకగా వచ్చిన లైలా సినిమా అతి చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. స్వయంగా విశ్వక్ సేన్ అందరికీ సారీ చెబుతూ బహిరంగ లేఖ రాశాడంటే, ఈ సినిమా ఫలితాన్ని ఊహించుకోవచ్చు.
ఇక బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కలిసి చేసిన బ్రహ్మ ఆనందం సినిమా మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది కానీ థియేటర్లలో నిలబడలేకపోయింది. పేపర్ పై బాగుందనిపించిన ఈ కథ, దర్శకత్వ లోపం వల్ల ఫెయిలైంది.
ఇక ఇదే వారంలో ప్రేమికుల రోజు కానుకగా ఆరెంజ్, ఇట్స్ కాంప్లికేటెడ్ లాంటి రీ-రిలీజ్ లు వచ్చాయి.
మూడో వారంలో డబ్బింగ్ సినిమాల హవా నడిచింది. జాబిలమ్మ నీకు అంత కోపమా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి సినిమాలతో పాటు బాపు, రామం రాఘవం లాంటి స్ట్రయిట్ మూవీస్ కూడా వచ్చాయి. వీటిలో బాపు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరో బలగం అవుతుందనే అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజే తేలిపోయింది. రామం రాఘవం కూడా ఆడలేదు.
డబ్బింగ్ సినిమాల్లో ధనుష్ డైరక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మెప్పించలేకపోయింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫస్ట్ వీకెండ్ మెరిసి చతికిలపడింది.
ఇక చివరి వారంలో వచ్చిన మజాకా సినిమా, కొంచెమే మజాను అందించగా.. ఆది పినిశెట్టి చేసిన శబ్దం సినిమా నిరాశపరిచింది. ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో రీ-రిలీజెస్ తో కలిపి 21 సినిమాలు విడుదవ్వగా.. తండేల్ సినిమా హిట్ అనిపించుకుంది. ఫిబ్రవరి సెంటిమెంట్ ను కొనసాగించింది.
Emito l 1 1 yatra cinemalu feb lo release aithe bavundedi
Netizens posts roi vankara g a l k
All movies are good
Call
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ooru peru Bhairavakona is not a hit..
It’s a loss venture for buyers and Producers also..Buyers ki 20% losses.. Breakeven avvaledu.. Producers ki kuda loss ye