వైసీపీ లో భారీ మార్పు చేర్పులకు అధినాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆ పార్టీలో పనిచేయని వారిని, క్రియాశీలంగా ఉండని వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆ విధంగా నియోజకవర్గాల ఇంచార్జిలను మారుస్తున్నారు.
ఉత్తరాంధ్రాలో చూస్తే, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం అయితే ఎటూ తెమలడంలేదు అని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించడం లేదు.
ఆయన మాటే ఎక్కడా వినిపించడం లేదు. దాంతో ఆయన పార్టీలో కొనసాగుతారా అన్న డౌట్లు అందరిలోనూ వచ్చాయి. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం ఆయన మీద విశ్వాసం ఉంచింది. పార్టీలో ఆయన కొనసాగాలని కోరుకుంటోంది. అందుకే అన్ని చోట్లా ఇంచార్జిలను నియమించినా శ్రీకాకుళానికి మాత్రం ధర్మాన ప్రసాదరావుకే అన్నట్లుగా ఉంచింది.
అయితే ఎన్నికలు అయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయిపోయిన నేపధ్యంలో జనంలోకి వైసీపీ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మీదట పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంటుంది. దాంతో ఎదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం అటు పార్టీకి, ఇటు పెద్దాయనకు వచ్చిందని అంటున్నారు.
పార్టీలో యాక్టివ్ గా లేకపోతే కొత్త వారిని తెచ్చి పెడతామని వైసీపీ అంటోంది. ఇదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిని తెచ్చి ఇంచార్జిగా చేశారు. అలాగే శ్రీకాకుళానికి ఎవరిని అయినా కొత్త వారిని పెడతారు అన్న ప్రచారం సాగుతోంది.
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు అని టాక్ నడుస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన కుమారుడి కోసమే క్రియాశీలంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు కనుక చురుకుగా రాజకీయాలు చేస్తే వైసీపీకి జిల్లాలో మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు ఏమి చేయబోతున్నారు అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
అధికారం లో ఉన్నప్పుడే నోటి తీట తో చేసిన డామేజ్ చేసింది సరిపోలేదా …చింత చచ్చిన పులుపు చావనట్టు విపక్ష హోదా గల్లంతు ఐన కానీ దిక్కుమాలిన ఎలేవేషన్స్ తగ్గించలేదు….సరే కానిండి…
Emi bchestaam..nidra lechinappude..veedi article vadulu taadu
..adi tussu mantundi
Sarepoyeru andharu
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Whomsoever may take charge it is good if they are interested in expressing public opinion and interests …. represent and be a true leader in a democratic manner …. don’t attempt to criticize individuals but the policies of Government if they are not in tune with public interest … try not to take names of individuals …. educate people what is wrong in the policies of Government if any exists …. dont go by emotions against individuals …. then people automatically with you only …..