అందరూ ఊహిస్తున్నట్లే కాంగ్రెసు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెసు పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్, బీజీపీ నాయకుల కంటే ఎక్కవగా చెలరేగిపోయిన మల్లన్నపై కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాగానే వేటు పడింది. బహుశా ఇది ఆమె ఆమోదంతోనే జరిగి ఉండొచ్చు.
తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి ఆయనపై వేటు వేస్తే బీసీలు పార్టీకి వ్యతిరేకమవుతారనే ఉద్దేశంతో ఇంతకాలం మల్లన్నను సహించారు. ఆయనలో మార్పు వస్తుందని అనుకున్నారు. కాని ఆయన కాంగ్రెసు పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఆపలేదు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
రేవంత్ రెడ్డే చివరి రెడ్డి సీఎం అని చాలాసార్లు చెప్పాడు. తరువాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని అన్నాడు. తాను కాంగ్రెసు నుంచి బయటపడాలని మల్లన్న అనుకొని ఉండొచ్చు. అందుకే పార్టీ లైన్ దాటి వ్యవహరించాడు. చివరకు ఆయన కోరుకున్నదే జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న… తనదైన శైలిలోనే ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు.
బీసీ నినాదాన్ని బలంగా వినిపించే దిశగా అడుగులు వేశాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ…. పలువురు నేతల తీరును సూటిగా ప్రశ్నించటం మొదలుపెట్టాడు. కొన్ని వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో… తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చేది బీసీ రాజ్యమేనని… ఇందుకోసం ఎక్కడివరకైనా పోరాటం చేస్తామంటూ ప్రకటనలు కూడా చేశాడు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాలను తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించాడు. బీసీల లెక్కలను తక్కువ చేసే కుట్ర జరిగిందని.. కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆ నివేదికను కాల్చి నిరసన వ్యక్తం చేశాడు. ఇక వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీ సభలో…. రెడ్డిసామాజికవర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఆ వర్గం వారు గాంధీ భవన్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. ఫలితంగా తీన్మార్ మల్లన్న తీరు… కాంగ్రెస్ పార్టీలో రచ్చకు దారి తీసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మల్లన్న నుంచి వివరణ రాలేదు. దీంతో చివరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటంతో… తీన్మార్ మల్లన్న దారెటు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే బీసీ వాదంతో కొత్త పార్టీ ప్రకటిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా బీసీ సంక్షేమాన్ని ముందుంచుకుని బలమైన వాదనలు చేస్తున్నాడు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, వారి హక్కుల కోసం బీసీలంతా ఐక్యంగా రావాలంటూ ఆయన పదేపదే చెబుతున్నాడు.
దీనికి తోడు బీసీ నేతలు ఆర్. కృష్ణయ్య, వట్టే జానయ్య కూడా అవసరమైతే బీసీలంతా కలిసి ఓ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొనడం, మల్లన్న కూడా ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని బలపరుస్తున్నాయి. మల్లన్న సస్పెన్షన్ తర్వాత, అతని మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రస్థానం చూస్తే.. గతంలో బీజేపీలో చేరి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు అడుగులు వేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ తిరిగి పునాది వేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో, మల్లన్నను ఆ పార్టీ ఆకర్షించే అవకాశముందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ బీసీలకు అనుకూలమైన పార్టీగా పేరుపొందడం, రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉండడం కూడా మల్లన్నకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగుల గురించి తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Manchidi
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Matti kott uku potaadu….ilanti vallu chals mandi unnaru…