రావిపూడిని కాపీ కొట్టండి..కానీ..!

సినిమా పబ్లిసిటీ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు..తరువాత అన్నట్లు మార్చేసారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత దిల్ రాజు బ్యానర్ సినిమాలు అంటే పబ్లిసిటీ అంతంత మాత్రంగా వుంటుందన్నది ఇండస్ట్రీ టాక్. Advertisement…

సినిమా పబ్లిసిటీ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు..తరువాత అన్నట్లు మార్చేసారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత దిల్ రాజు బ్యానర్ సినిమాలు అంటే పబ్లిసిటీ అంతంత మాత్రంగా వుంటుందన్నది ఇండస్ట్రీ టాక్.

దిల్ రాజు సోదరుడు శిరీష్ మీడియాతో ఇటీవల మాట్లాడుతూ తమ ఎస్ వి సి బ్యానర్ కు మీడియా ఇంతలా కోపరేట్ చేయడం ఫస్ట్ టైమ్ అని అంగీకరించారు. ఇక్కడ మీడియా ఘనత లేదు. ఎస్ వి సి తప్పు లేదు. అంతా అనిల్ రావిపూడి మహిమ.

సంక్రాంతికి వస్తున్నా సినిమా పబ్లిసిటీకి కర్త, కర్మ, క్రియ అంతా అనిల్ రావిపూడినే. కేవలం కంటెంట్ క్రియేట్ చేయడం కాదు. దాన్ని జనాల్లోకి ఎలా, ఎప్పుడు, ఏ విధంగా పంపాలి అన్నది కూడా ఆయనే ప్లాన్ చేసుకున్నారు. పీఆర్ టీమ్ అందుకు సహకరించింది.

ఇప్పుడు రాబోయే సినిమాలు అన్నీ రావిపూడిని అడుగుజాడల్లో వెళ్లాలనుకుంటున్నాయి. వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి చేరాల్సిన విధంగా జనాలకు చేరడం లేదు. ఎందుకు? రావిపూడి టెక్నిక్ లను పూర్తిగా పట్టుకోలేకపోయారు కనుక.

కంటెంట్ క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి స్టయిల్ ను కొంత వరకు పట్టుకోవచ్చు. హీరోలను ఒప్పించి రకరకాల స్కిట్ చేయడం అన్ది అంత వీజీ కాదు. అది కూడా సాధించినా, జనాల్లోకి చేర్చడం అన్న ఆర్ట్ కూడా వేరు.

ఆ విషయంలో అనిల్ మాస్టర్స్ చేసేసారు. ఇప్పుడు అనిల్ అడుగుజాడల్లో నడవాలి అనుకునేవారి దగ్గర సమస్య ఏమిటంటే హీరో ఒకలా ఆలోచిస్తే దర్శకుడు ఇంకోలా..నిర్మాత మరోలా. కొన్ని చోట్ల హీరో కోపరేషన్ వుండదు. పైగా ఈ సినిమాలకు పని చేసే డిజిటల్ టీమ్ వీళ్ల మాట వినదు. అనిల్ రావిపూడి దగ్గర వన్ మ్యాన్ డెసిషన్. అన్నింటా. అక్కడ వుంది అసలు సక్సెస్.

మిగిలిన చోట్ల ఎద్దు ఎండకి, ఎనుబోతు నీడకి లాగినట్లు వుంటుంది పరిస్థితి. దాంతో కంటెంట్ వృధాగా వేస్ట్ అయిపోతోంది. రావాల్సిన పబ్లిసిటీ రావడం లేదు. చేసిన స్కిట్ లు చూసి బాగా చేసాం కదా అని టీమ్ సంతృప్తి పడడం తప్ప ఫలితం లేదు.

3 Replies to “రావిపూడిని కాపీ కొట్టండి..కానీ..!”

Comments are closed.