తాడిప‌త్రిలో జేసీ రాజ్యాంగ‌మా?

తాడిప‌త్రిలో అంబేద్క‌ర్ రాజ్యాంగానికి బ‌దులు, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ్యాంగం న‌డుస్తోంద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

తాడిప‌త్రిలో అంబేద్క‌ర్ రాజ్యాంగానికి బ‌దులు, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ్యాంగం న‌డుస్తోంద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తాడిప‌త్రిలో అడుగు పెట్ట‌నివ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తంలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటి మీద‌కి పెద్దారెడ్డి వెళ్ల‌డాన్ని పౌర స‌మాజం త‌ప్పు ప‌ట్టింది. అధికారంలో ఉన్నామ‌ని రెచ్చిపోవ‌డం స‌రైంది కాద‌నే విమ‌ర్శ వెల్లువెత్త‌డంతో పెద్దారెడ్డి కూడా త‌గ్గారు.

బ‌హుశా దానికి ప్ర‌తీకారంగా పెద్దారెడ్డిని సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌నివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు అనంత‌పురం పోలీస్ యంత్రాంగం …జేసీ నియంతృత్వాన్ని చేష్ట‌లుడిగి చూస్తోంద‌న్న విమ‌ర్శ లేక‌పోలేదు. అధికారంలో ఉన్న‌వాళ్లు, ప్ర‌త్య‌ర్థుల్ని నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌కుండా చేస్తే, ఇక పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్న‌ట్టు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇలాగైతే, రానున్న రోజుల్లో అధికారం మారితే, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి స్వ‌చ్ఛందంగా తాడిప‌త్రి వ‌దిలిపెడ్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, ఒక ప‌రిధి దాటి ఎవ‌రూ వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. అప్పుడు వాళ్లు అలా చేశార‌ని వీళ్లు, ఇప్పుడు వీళ్లు ఇలా చేశార‌ని, ఆ త‌ర్వాత వాళ్లు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ పోతే, ఇక అంతం ఎక్క‌డ‌? జ‌నం అధికారం ఇచ్చింది ఇందుకేనా? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

మ‌రీ ముఖ్యంగా వైసీపీ నాయకుడు ర‌మేష్‌రెడ్డికి చెందిన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ను మున్సిప‌ల్ అధికారుల‌తో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కూల్చి వేయించార‌నే ప్ర‌చారం, ఆయ‌న‌కు చెడ్డ‌పేరు తీసుకొస్తోంది. దీనివ‌ల్ల ఏం సాధిస్తార‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు. ఇలాంటి ధోర‌ణులే తాడిప‌త్రిలో జేసీ రాజ్యాంగం న‌డుస్తోంద‌నే విమ‌ర్శ‌కు ఆస్కారం క‌లిగిస్తున్నాయి.

6 Replies to “తాడిప‌త్రిలో జేసీ రాజ్యాంగ‌మా?”

  1. గత 5 ఎళ్ళు రాష్ట్రం మొత్తం మన జగన్ రాజ్జాంగమెగా నడిచింది! ఎకంగా చంద్రబాబు నె 54 రొజులు జైల్లొ పెట్టారు! ఎందుకురా ఇప్పుడు శ్రిరంగనీతులు చెపుతావు!

  2. జగన్ అన్న రాజ్జాంగం గురించి ఎప్పుడన్నా రాశవా గురువిందా?

    RRR Custodial torture…

    Dr. Sudhakar

    Acchem Naidu

    Dulipala Narendra

    Kuna Ravi

    JC brothers

    ABN, EENADU

    Margadarsi Chits

    Amar raja Batteries

    Amaravati Farmers

    Ranaganayakamma (Faceb00k post)

    Babai Muder Case

    Chandrababu Naidu

    List goes on…

Comments are closed.