ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి, ఇతడు ఈ సినిమా పనిలో ఉంటుండగానే, మరోవైపు అతడి అప్ కమింగ్ సినిమాలపై పుకార్లు పుట్టుకొచ్చాయి. త్వరలోనే బాలయ్య హీరోగా అనీల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రావిపూడి కూడా కన్ ఫర్మ్ చేశాడు. అయితే ఇక్కడ మేటర్ ఇది కాదు.
బాలయ్య సినిమాతో పాటు ఎన్టీఆర్ హీరోగా అనీల్ రావిపూడి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తో కథాచర్చలు కూడా మొదలయ్యాయంట. ఈమధ్యకాలంలో ఇలా వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు ఈ దర్శకుడు.
“ఇవన్నీ మాటల వరకు మాత్రమే. ఇప్పటి వరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. బాలకృష్ణతో మాత్రం ఓ సినిమా ఉంది. సెప్టెంబర్ నుంచి అది మొదలవుతుంది. ఇక ఎన్టీఆర్ తో సినిమా విషయానికొస్తే, నేను ఆయనతో టచ్ లో ఉన్నాను. అంతవరకే. ఆయనింకా తన లైనప్ పై క్లారిటీకి రాలేదు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ తో సినిమాకు సంబంధించి ఏదీ ఫైనలైజ్ కాలేదు.”
ఇలా ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు అనీల్ రావిపూడి. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఎఫ్3 రిజల్ట్ పై మాత్రమే ఉందని, ఆ తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ పెడతానని, ఎన్టీఆర్ తో సినిమా గురించి తను ప్రస్తుతానికి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా 27న థియేటర్లలోకి రాబోతోంది. ఎఫ్2కు ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఎన్టీఆర్-రావిపూడి కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.