Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య సినిమా కథ చెప్పేసిన అనీల్ రావిపూడి

బాలయ్య సినిమా కథ చెప్పేసిన అనీల్ రావిపూడి

ఎఫ్3 పూర్తయిన వెంటనే బాలయ్య సినిమా వర్క్ మొదలుపెట్టబోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపిన ఈ దర్శకుడు.. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో బాలయ్య సినిమా విశేషాలన్నింటినీ బయటపెట్టాడు. బయట వినిపిస్తున్న పుకార్లపై స్పందిస్తూనే, బాలయ్య పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని వెల్లడించాడు.

"తండ్రి-కూతురు మధ్య నడిచే కథ ఇది. తండ్రిగా బాలయ్య, కూతురుగా శ్రీలీల కనిపిస్తారు. బాలయ్య ఇందులో కాస్త వయసుమళ్లిన పాత్రలో కనిపిస్తారు. సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది. పోకిరి, గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు హీరోల పాత్రల చుట్టూ తిరుగుతాయి. బాలయ్య సినిమాను కూడా అదే టెంప్లేట్ లో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. 50 ఏళ్ల వయసున్న ఓ తండ్రి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో అదే టోటల్ సినిమా."

ఇలా బాలకృష్ణ సినిమా అవుట్ లుక్ చెప్పేశాడు రావిపూడి. ఇప్పటివరకు బాలయ్యను ఎవ్వరూ ఈ కోణంలో చూపించలేదని, తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని, కొత్తగా ఓ ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు అనీల్ రావిపూడి.

"బాలయ్యను నేను వేరే కోణంలో చూస్తున్నాను. అది నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా రిలీజయ్యాక బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనిపిస్తుంది. అయితే బాలయ్య స్టయిల్, ఆయన మాస్ లుక్, డైలాగ్స్ అన్నీ ఉంటాయి. వీటితో పాటు నేను అనుకుంటున్న కోణం కూడా ఉంటుంది."

ఈ సినిమా కోసం అనీల్ రావిపూడి తన బ్రాండ్ ను పక్కనపెడుతున్నాడు. సినిమాలో తన మార్క్ కామెడీ ఉండదని స్పష్టం చేశాడు. పూర్తిగా తన ఇమేజ్ ను పక్కనపెట్టి, బాలయ్యతో ఓ ప్రయోగం చేస్తున్నానని, తన కెరీర్ బెస్ట్ వర్క్ గా బాలయ్య సినిమా నిలిచిపోతుందని చెబుతున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?