చినబాబు అంటే లోకేష్ బాబే. ఆయన తెలుగుదేశానికి పెదబాబు చంద్రబాబు తరువాత రధ సారధి. ఇక ఏపీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. కానీ చినబాబుకు పోటీ చేసే సీటు ఒక్కటీ లేదా అంటే ఉండకేమి అన్నీ ఉన్నాయి. కానీ గెలుపు గుర్రాలు ఏవీ అన్నదే ఇపుడు చూడాలి.
చినబాబుకు గ్యారంటీ సీటు చూసుకుంటే ఆయన 2024 ఎన్నికల్లో సులువుగా పోటీ చేసి గెలుస్తారు. అందుకోసం మరో మారు ఉత్తరాంధ్రా జిల్లాల వైపు చినబాబు చూపు మళ్ళిందా అన్నదే పార్టీలో అనుకుంటున్న మాట.
ఈ మధ్య శ్రీకాకుళం జిల్లా వచ్చిన చినబాబు అక్కడ పార్టీ తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. జగన్ వేవ్ లో కూడా గెలిచిన రెండు సీట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో ఇచ్చాపురం నుంచి పోటీ చేస్తే విజయం ఖాయాని పార్టీ వర్గాలు చెప్పాయట.
ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ డౌట్ అంటున్నారు. ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ అవుతోంది. దాంతో లోకేష్ బాబు బరిలో దిగితే గెలుపు ఈజీ అని తమ్ముళ్ళు చెప్పారని అంటున్నారు.
మరి ఉత్తరాంధ్రా జిల్లాలు మాకు కంచుకోట అని చెబుతున్న టీడీపీ పెద్దలు చినబాబుని రంగంలోకి దించడం ద్వారా ఊపు తీసుకురావాలని చూస్తున్నారా. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.
మొత్తానికి చినబాబు ఇచ్చ ప్రకారం ఏదైనా జరుగుతుంది కాబట్టి ఇచ్చాపురం చినబాబు లిస్ట్ లో టాప్ ప్రయారిటీలో ఇపుడు ఉంది అంటున్నారు అంతా.