తనకు ఎవరైనా నచ్చితే అంతే. వరుసగా మళ్లీ అతడితోనే సినిమాలు చేస్తుంటారు నిర్మాత అనీల్ సుంకర. ఈ వ్యవహారశైలి వెనక బిజినెస్ లెక్కలు ఉండనే ఉన్నాయి. లెక్కలు-లాజిక్స్ ఏవైనా ఇలా వ్యవహరించే నిర్మాత ప్రస్తుతానికి అనీల్ ఒక్కరే.
ఇప్పుడీ నిర్మాత మరోసారి తన పద్ధతిని ఫాలో అయిపోయారు. దర్శకుడు వీఐ ఆనంద్ తో మరో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో 'ఊరు పేరు భైరవకోన' సినిమా నడుస్తోంది. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు కాగా, అనీల్ సుంకర ప్రజెంటర్. ఇప్పుడు ఇదే దర్శకుడితో మరో సినిమా ఎనౌన్స్ చేశారు ఈ ప్రొడ్యూసర్.
ఒకప్పుడు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ అనీల్ సొంతం. ఆ తర్వాత హీరో రాజ్ తరుణ్ తో కూడా అలానే వరుసపెట్టి సినిమాలు తీశారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని వీఐ ఆనంద్ తో కూడా కొనసాగిస్తున్నారు.
ఊరు పేరు భైరవకోన సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన రాజేష్ దండా ఈ కొత్త ప్రాజెక్టుకు సహ-నిర్మాతగా మారడం విశేషం. ఇక కిషోర్ గరికపాడి, అబ్బూరి రవి ఆటోమేటిగ్గా రిపీట్ అయ్యారు. హీరోగా సందీప్ కిషన్ ను కూడా రిపీట్ చేస్తే.. ఓ పనైపోతుందేమో.