యానిమల్.. నాకన్నా చెడ్డవాడు లేడు

సందీప్ వంగా చేసిన సినిమాలు తక్కువ. కానీ తెచ్చుకున్న పేరు ఎక్కువ. అతగాడి యానిమల్ టీజర్ కోసం, ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటే అతగాడి మీద నమ్మకం, అతడి…

సందీప్ వంగా చేసిన సినిమాలు తక్కువ. కానీ తెచ్చుకున్న పేరు ఎక్కువ. అతగాడి యానిమల్ టీజర్ కోసం, ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటే అతగాడి మీద నమ్మకం, అతడి సినిమాల మీద ఆసక్తి ఆ రేంజ్ లో వున్నాయి. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.

తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో అల్లుకున్న కథ అని ముందు నుంచి చెబుతున్నారు. టీజర్ కూడా దాని మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. దారితప్పిన రిచ్ కిడ్ బయోపిక్ లాంటి కథ అని టీజర్ చెబుతోంది. అయితే తనను తాను వెదుక్కున్నట్లుగా, తనలో చెడును తాను వెదక్కుంటూ, దారిని నిర్మూలించడం కోసం చేసే జర్నీ అనుకోవాలేమో.

కచ్చితంగా కమర్షియల్ ఫార్మాట్ ల్లో.. సమ్ థింగ్ కొత్తగా.. స్టాండ్ అవుట్ గా నిలబడేలాగే వుంది యానిమల్ సినిమా. టీజర్ ఆ మేరకు ప్రామిస్ చేస్తోంది. నటన, దర్శకత్వం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటే అమెచ్యూర్ గా వుటుంది. 

అలాంటి నటులు, దర్శకుడు పని చేసినపుడు మాట్లాడుకోవాల్సింది కంటెంట్ గురించే కదా. ఆ విధంగా యానిమల్ సినిమా బాలీవుడ్ సినిమాలకు భిన్నంగానే కాకుండా కాంటెంపరరీగా వుండేలాగా వుంది.