జవాన్ లో అజ్ఞాతవాసి.. ఏంటి అనిరుధ్ ఇది!

ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం అనిరుధ్. తన మ్యూజిక్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు ఈ సంగీత దర్శకుడు. రజనీకాంత్ లాంటి సూపర్…

ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం అనిరుధ్. తన మ్యూజిక్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు ఈ సంగీత దర్శకుడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు, రజనీ టైటిల్ తర్వాత, “ఏన్ అనిరుధ్ మ్యూజికల్” అంటూ సెపరేట్ టైటిల్ కార్డు పడిందంటే.. ఈ కంపోజర్ స్థాయి/క్రేజ్ ను ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

అలాంటి అనిరుధ్, ఇప్పుడో ప్రతిష్టాత్మక బాలీవుడ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షారూక్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఇతడే. ఆల్రెడీ లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమం నడుస్తోంది.

ఇందులో భాగంగా విడుదలైన ఫస్ట్ లిరికల్ వీడియోకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తాజాగా రెండో లిరికల్ వీడియో విడుదల చేశారు. షారూక్-నయనతార మధ్య వచ్చే డ్యూయట్ ఇది. ఇప్పుడీ సాంగ్ పై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి.

అనిరుధ్ స్టయిల్ లోనే ఉంది ఈ పాట. కాకపోతే ఈ సాంగ్ ను ఆల్రెడీ ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. 2-3 సార్లు వినేకొద్దీ ఈ పాట అజ్ఞాతవాసిలోని 2 పాటలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది.

పవన్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. అందులో 'గాలివాలుగా..', 'బయటకొచ్చి చూస్తే..' అనే లిరిక్స్ తో సాగే పాటలు 2 ఉన్నాయి. ఈ 2 పాటల్ని కలిపి జవాన్ సినిమాలో తాజా సాంగ్ ను కంపోజ్ చేసినట్టు అనిపిస్తోంది.

తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు అనిరుధ్. అయితే జవాన్ సినిమాకు మాత్రం ఇప్పటివరకు సరైన సాంగ్ అందించలేకపోయాడు. ఈ సినిమాలో మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి.