Advertisement

Advertisement


Home > Movies - Movie News

అన్న కోసం వస్తున్న తమ్ముడు

అన్న కోసం వస్తున్న తమ్ముడు

నందమూరి అన్నదమ్ముల మధ్య వున్న అనుబంధం తెలిసిందే. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ఒక మాటగా, ఒక బాటగా వుంటూ వస్తున్నారు. అన్న కళ్యాణ్ రామ్ కోసం అతని బ్యానర్ లో జై లవకుశ సినిమా కూడా చేసారు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయబోయే సినిమా కు కూడా కళ్యాణ్ రామ్ బ్యానర్ జోడిస్తున్నారు. 

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా 'ఎంత మంచి వాడవురా'. ఈ సినిమా జనవరి 15న విడుదలవుతోంది. మిగిలిన హీరోలు, ఇంకే హీరో మద్దతు తీసుకుందామా? ఎవర్ని తీసుకువచ్చి, ఫంక్షన్ సక్సెస్ చేసుకుందామా? అని చూస్తారేమో? కళ్యాణ్ రామ్ కు ఆ సమస్య లేదు. ఎన్టీఆర్ నే పెద్ద దన్ను.

జనవరి ఆరు లేదా ఏడున జరిగే ఎంత మంచి వాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ మేరకు ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. ఆదిత్య మూవీస్ సంస్థ తొలిసారిగా సినిమా నిర్మాణంలోకి దిగింది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యం వహించారు. మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సతీష్ వేగ్నిశ దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?