ఆ సినిమా ఆగిపోలేదు.. ప్రకటించిన అనుష్క

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆమె వ్యక్తిగత కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో…

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆమె వ్యక్తిగత కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని, ఇక సినిమాలకు దూరమౌతుందని గాసిప్పులొచ్చాయి. వీటిని అనుష్క ఖండించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆగిపోయిందనుకున్న సినిమాను అధికారికంగా ప్రకటించింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ గా ఓ సినిమా రాబోతోంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో నవీన్ పొలిశెట్టిని హీరోగా అనుకుంటున్నారు.

3-4 ఏళ్ల నుంచి సినిమాలు బాగా తగ్గించేసింది అనుష్క. బాహుబలి-2 తర్వాత భాగమతి చేసింది. ఆ తర్వాత సైరాలో ఓ చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైమ్ లో ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజైంది. మళ్లీ ఇన్ని రోజులకు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేయబోతోంది స్వీటీ.

వైవాహిక వ్యవస్థపై నమ్మకం లేని ఓ అమ్మాయి, తనకంటే చిన్నవాడైన ఓ అబ్బాయితో డేటింగ్, గర్భం దాల్చడం లాంటి వ్యవహారాలతో ఈ సినిమా రాబోతోంది. వరుసగా కాన్సెప్ట్ ఫిలిమ్స్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్ధ, ఈ సినిమాను ఓ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ గా చెప్పుకొస్తోంది.