మరోసారి తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్?

విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికి ఓ కారణం ఉంది. Advertisement…

విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికి ఓ కారణం ఉంది.

రీసెంట్ గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్ వద్ద వీళ్లిద్దరూ కనిపించారు. దీంతో అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు బాలీవుడ్ లో వరుసగా కథనాలు వస్తున్నాయి.

కొన్ని రోజులుగా కెమెరాకు దూరమైంది అనుష్క శర్మ. భర్త విరాట్ మ్యాచులకు కూడా ఆమె హాజరుకావడం లేదు. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. దీనికితోడు గణేశ్ చతుర్ధికి ఆమె పెట్టిన పోస్టు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉంది.

అటు విరాట్ కూడా మ్యాచులు తగ్గించేశాడు. ఒకప్పుడు విరాట్ ఎక్కడుంటే, అనుష్క అక్కడ కనిపించేది. కానీ ఇప్పుడు విరాట్ ఒక్కటే సింగిల్ గా ప్రయాణాలు చేస్తున్నాడు. దీంతో విరాట్ దంపతులు తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు.

అయితే ఈ విషయాన్ని విరుష్క జోడీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విరాట్-అనుష్క 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో కూతురు వామికాకు జన్మనిచ్చింది అనుష్క. ఇప్పుడీమె మరోసారి గర్భందాల్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఎలాగైతే ప్రకటించారో, ఈసారి కూడా విరుష్క జోడీ, కాస్త లేటుగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.