మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా తొలిసారిగా అనుష్క నటించబోతోందన్న వార్తలు చాలా కాలం కిందటే బయటకు వచ్చాయి. యువి సంస్థ నిర్మించే సినిమా కోసం అనుష్క ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లే అంటూ వార్తలు పక్కాగా వినిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టాలన్నది ప్లాన్.
మెగాస్టార్ తో సమస్య లేదు. ఆయన వన్స్ షూట్ స్టార్ట్ చేస్తే ఇక బండి ఆగదు. కానీ అనుష్కతో అంత వీజీ కాదని ఆమె గత సినిమాల అనుభవం చెబుతోంది. యువి సంస్థ మిస్ శెట్టి.. మిస్టర్ శెట్టి ఎన్నాళ్లు ప్రొడక్షన్ లోనే వుందో అందరికీ తెలిసిందే. పైగా అనుష్క తో సమస్య ఏమిటంటే ఆమె శరీరాకృతిని కూడా కొంత వరకు సిజి చేయాల్సి వుంటుంది.
ఇప్పుడు ఆమె కొంత వరకు సన్నబడ్డారని వార్తలు వున్నాయి. మిస్ శెట్టి టైమ్ లో ఆమెతో ఒక్క కామన్ ఇంటర్వూ చేస్తేనే రిలీజ్ చేయడానికి కిందా మీదా అయ్యారు. పైగా యువి సంస్థ ఆమెకు పుట్టిల్లు లాంటిది. ఆమె ఎలా అంటే అలానే. అందువల్ల చకచకా షూట్ జరుగాలి అంటే అనుష్క కోపరేషన్ కచ్చితంగా వుండాలి.
మెగాస్టార్ నటించే 156వ సినిమా ఇది. వాస్తవానికి దీని ప్లేస్ లో మెగా తనయ నిర్మాతగా సినిమా వుండాలి. భోళాశంకర్ ప్లాఫ్ కావడంతో, ముందు చూపుతో, ఆ సినిమాను పక్కన పెట్టి, యువి సినిమాను ముందుకు తెచ్చారు. ఇప్పుడు ఇది పూర్తయితే అప్పుడు ఆ సినిమా ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది.