Advertisement

Advertisement


Home > Movies - Movie News

టికెట్ ల వ్యవహారం చెడగొడుతున్నారా?

టికెట్ ల వ్యవహారం చెడగొడుతున్నారా?

గత రెండు రోజులుగా అమరావతి నుంచి టాలీవుడ్ కు సానుకూల వార్తలు అందుతున్నాయి. ఆ వార్తలు అందిన తరువాత మెగాస్టార్ పీఆర్ టీమ్ నుంచి మీడియాకు ఫీలర్లు మొదలయ్యాయి. మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారహో…అంటూ. నిజానికి అక్కడ అంత లేదు. 

బాలకృష్ణ అపాయింట్ మెంట్ అడిగితేనే, మీరే డీల్ చేయండి అని సంబంధిత మంత్రికి చెప్పేసారు జ‌గన్. ఇప్పుడు కూడా అధికార వర్గాలు కాకుండా పార్టీ వర్గాలే వ్యవహారం డీల్ చేయడం ప్రారంభించాయి. పరిస్థితి చేతులు దాటకుండా, సామరస్యంగా పరిష్కరించాలని పార్టీ కీలక బాధ్యుడు ఒకరు వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుని డీల్ చేయడం ప్రారంభించారు. ఈ మేరకు టాలీవుడ్ కీలక వ్యక్తులతో సంప్రదింపులు ప్రారంభించారు.

ఇలాంటి నేపథ్యంలో నిన్నటికి నిన్న ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా విమర్శలు మొదలయ్యాయి. చానెళ్లలో డిస్కషన్లు, మూలన పడుకున్న రాజ‌కీయ నాయకులు, అలాగే సినిమా నిర్మాణాలు ఆపేసిన వృద్ద నిర్మాతలు ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. సహజంగానే ఇవన్నీ వ్యవహారం బిగుసుకుపోయేలా చేస్తాయి.

అసలే సిఎమ్ జ‌గన్ వైఖరి తెలిసిందే. పంతానికి పోతే ఎంతకైనా రెడీ, ఎంత నష్టమైనా రెడీ అనే టైపు. ఇప్పుడు ఇలాంటివి అన్నీ కలిసి వ్యవహారానికి చెడగొడతాయేమో అని టాలీవుడ్ జ‌నాలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రెండు రోజులు సైలంట్ గా వుంటే అంతా సర్దుకుంటాయని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?