కొన్నాళ్ల క్రితం సడెన్ గా వినిపించిన ప్రాజెక్టు ఒకటి వుంది. హీరో నాగశౌర్యతో ఫ్యామిలీ మన్ దర్శకులు రాజ్-డికె ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చారని. మాటలు జరిగాయి. అడ్వాన్స్ లు కుదిరాయి. అన్నీ అయ్యాక ఆ సినిమా మరి ముందుకు వెళ్లలేదు.
ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచీ కూడా తెలుగులో ఓ సినిమా చేయడానికి రాజ్-డికె ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇన్నాళ్లకు పైనల్ అయింది.
విజయ్ దేవరకొండ హీరోగా రాజ్-డికెే ఓ సినిమా తీయబోతున్నారని హీరో పర్సనల్ టీమ్ వైపు నుంచే సమాచారం మీడియాకు ‘ఎక్స్ క్లూజివ్’ గా అందింది. నాగశౌర్యతో చెేయాలనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు విజయ్ తో చేయాలనుకుంటున్న ప్రాజెక్టు వేరు కావచ్చు. విజయ్ తో సినిమా పాన్ ఇండియా కావచ్చు. ఎందుకంటే రాజ్-డికె తమ ప్రయాణం తెలుగులో స్టార్ట్ చేసినా, ఫ్యామిలీమన్ సిరీస్ తో నేషనల్ వైడ్ కు చేరిపోయారు.
రాజ్-డికె సినిమా చేస్తే నిర్మాతలు వారే అవుతారు. ఇది కాకుండా దిల్ రాజు-ఇంద్రగంటి లేదా దిల్ రాజు-హరీష్ శంకర్ కాంబినేషన్లు కూడా వినిపిస్తూనే వున్నాయి. ఇవి కాక మైహోమ్ కు ఓ సినిమా చేయాలి. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ఖుషీ సినిమా డిసెంబర్ లో విడుదలవుతుంది. ఆ లోగా విజయ్ తరువాత చేయబోయే సినిమా ఏమిటన్నది పక్కా క్లారిటీ వస్తుంది.