పెద్దింటి కుర్రాడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం అన్నది మామూలుగా వుండదు. సినిమా విడుదలయిన హిట్టా? ఫట్టా? అన్న సంగతి. ముందు అయితే విడుదల వరకు వీర హడావుడి వుంటుంది.
టాలీవుడ్ టాప్ స్టార్ ల్లో ఒకరైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. పెద్దగా హడావుడి లేకుండా, ఓ చిన్న సినిమా స్టార్ట్ చేసేసారు. శతమానం భవతి లాంటి హిట్, ఎంత మంచి వాడవురా లాంటి ఫట్ ఇచ్చిన సతీష్ వేగ్నిశ డైరక్టర్. కోవిడ్ రెండో దశ టైమ్ లో మొదలు పెట్టారు.
ఇప్పటికి ఇంకా నడుస్తూనే వుంది సినిమా. ఇంకా రెండు పాటలు, టాకీ బకాయి వుందని వినిపిస్తోంది. నిజానికి ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకుని వుంటే ఈ సినిమా ఎప్పుడో రెడీ అయిపోయేది. ఈ సినిమా ఇలా వుండగానే మరో సినిమా కూడా నితిన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ముగ్గురు హీరొల్లో ఒక హీరోగా.
మొదలు పెట్టిన సినిమా అలా నత్త నడక నడవడం, మరో సినిమాను ముగ్గురిలో ఒకరిగా ఎంచుకోవడం చూస్తుంటే నార్నే నితిన్ కెరీర్ విషయంలో ఎన్టీఆర్ అస్సలు జోక్యం చేసుకోవడం లేదని అనిపిస్తోంది.