సక్సెస్ స్పీక్స్ ఎవరి థింగ్ అని అననే అంటారు. ఎప్పుడూ అదే నిజం అవుతుంటుంది. ఒకే ఒక జీవితం సినిమా హిట్ కావడంతో ఆ డైరక్టర్ శ్రీకార్తీక్ కు ఆఫర్లు లైన్ కడుతున్నాయి. ఇందులో హీరో విజయ్ దేవరకొండది ఒకటి.
ఇక్కడ గమ్మత్తేమిటంటే గతంలో విజయ్ రెండు తమిళ నిర్మాతల సినిమాలు ఒకె చేసాడు. రెండూ దాదాపు ఒకే ఫ్యామిలీకి చెందిన బ్యానర్లు. ఒకటి నోటా సినిమా. అది చాలా ఆశలు పెట్టుకుంటే నిరాశపర్చింది. అప్పుడే నిర్మాత ఎస్ ఆర్ ఫ్రభు కు కూడా ఓ సినిమా చేయాలి. అదే ఒకే ఒక జీవితం సబ్జెక్ట్.
నోటా సినిమా ఫెయిల్ అయిన నేపథ్యంలో మళ్లీ మరో డిఫరెంట్ హీరో పాత్రతో సినిమా అనే సరికి వెనుకడుగు వేసాడు. దాంతో ఆ సినిమా అలా అలా శర్వానంద్ దగ్గరకు వెళ్లింది. అదంతా వేరే సంగతి. అప్పటి అడ్వాన్స్ ఇప్పటికీ విజయ్ దగ్గరే వుంది. అందుకే మళ్లీ పాత సినిమా ఐడియా రివైవ్ చేయాలనుకుంటున్నాడట. సరైన కథ వుంటే అదే బ్యానర్ లో అదే డైరక్టర్ తో చేయడానికి రెడీ అంటూ కబురు వెళ్లింది.
శ్రీకార్తీక్ మరి ఎలాంటి కథ తయారు చేసుకుంటాడో? ఎవరితో సినిమా చేస్తాడో? మొత్తానికి రెండో సినిమా అయితే మళ్లీ అదే డ్రీమ్ వారియర్ బ్యానర్ కే చేయాల్సి వుంది.