కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం పూర్తిచేసుకున్న అర్చన, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 13న లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగదీష్ ను పెళ్లాడబోతోంది అర్చన అలియాస్ వేద. డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటి ఆలోచనలు పెట్టుకోలేదు అర్చన. హైదరాబాద్ లోనే ఓ స్టార్ హోటల్ లో ఆమె పెళ్లి జరుగుతుంది. ఆ మరుసటి రోజు (నవంబర్ 14) గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు.
ఇరు కుటుంబాలు కూర్చొని ఈ తేదీలు ఫిక్స్ చేశాయి. ఓ పెద్ద హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు జగదీష్. తెలుగులో ఖలేజా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, యమదొంగ, బలుపు, లయన్ చిత్రాలు ఆమెకు ఓ మోస్తరు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె నటించిన మూవీ వజ్రకవచధర గోవింద. సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ గా కనిపించింది.
అర్చన కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. తపన అనే సినిమాతో వేద పేరుతో పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏదీ కలిసిరాలేదు. ఆ తర్వాత జాతకరీత్యా తన పేరును వేద నుంచి అర్చనగా కూడా మార్చుకుంది. అయినప్పటికీ ఆమెకు కెరీర్ కలిసిరాలేదు. చివరికి బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ఆ క్రేజ్ కూడా ఆమెకు పెద్దగా ఉపయోపగపడలేదు.