ఇద్దరూ భగ్న ప్రేమికులే. ఇద్దరికీ బ్రేకప్స్ ఉన్నాయి. జీవితాల్లో లవ్ ఫెయిల్యూర్స్ చూశారు. అలాంటి ఇద్దరు స్టార్స్ ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వాళ్లే శింబు-త్రిష. అవును.. వీళ్లిద్దరూ దగ్గరయ్యారంటూ మరోసారి కోలీవుడ్ లో పుకార్లు ఊపందుకున్నాయి.
శింబు సంగతి అందరికీ తెలిసిందే. నయనతారతో చాలా దూరం వెళ్లింది వ్యవహారం. కానీ అంతలోనే ఆ జంట బ్రేకప్ చెప్పుకుంది. తర్వాత హన్సికతో కనెక్ట్ అయ్యాడు శింబు. ఈసారి ఇంకాస్త ముందుకెళ్లాడు. విషయం పెళ్లిపీటల వరకు కూడా వెళ్లింది. కానీ ఆ రిలేషన్ షిప్ కూడా వర్కవుట్ కాలేదు.
ఇటు త్రిష గురించి చెప్పుకోవడానికి కూడా చాలా ఉంది. గతంలో రానాతో డేటింగ్ చేసిందనే రూమర్లు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను కూడా పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. కానీ శింబులానే ఈమెకు కూడా ఏ బంధం నిలవలేదు.
ఇలా చాలా ఏళ్లుగా భగ్న ప్రేమికులుగా కొనసాగుతున్న వీళ్లిద్దరూ ఓ పాయింట్ దగ్గర కలిశారని, పెళ్లి కూడా చేసుకుంటారని గతంలో పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత మెల్లగా అవే సద్దుమణిగాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జంట వార్తల్లోకెక్కింది. ఈసారి కచ్చితంగా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటోంది కోలీవుడ్ మీడియా.
త్రిష సినిమాలు తగ్గించింది. సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పాత డేటాను డిలీట్ చేసింది. అటు శింబు కూడా వరుసగా ఆలయాలు చుట్టేస్తున్నాడు. రహస్యంగా ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు. వీటికి తోడు వీళ్లిద్దరి వ్యవహారంపై శింబు తండ్రి టి.రాజేందర్ నర్మగర్బంగా స్పందించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది కోలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. త్రిష-శింబు ఇద్దరిదీ ఒకటే వయసు