బిగ్బాస్ ఫేమ్ ముక్కు అవినాష్, అరియాన మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాళ్లిద్దరూ బిగ్బాస్ హౌస్లో సన్నిహితంగా మెలిగారు. అలాగే హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా ఇద్దరూ షికార్లకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని, అందరూ అనుకున్నట్టు ఏమీ లేదని అరియానా పలు సందర్భాల్లో చెప్పారు.
తాజాగా అవినాష్ ఓ ఇంటివాడు కానున్న సమాచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవినాష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బిగ్బాస్ బ్యూటీ అరియానా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
‘అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు. అవినాష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’..అని అరియాన స్పష్టత ఇచ్చారు. అవినాష్ నిశ్చితార్థం జరగడంతో అరియాన్తో పెళ్లి ప్రచారానికి బ్రేక్ పడినట్టే!