అరియానా గ్లోరీ.. ఈమెకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమధ్య ఆర్జీవీ చేసిన సెక్సీయెస్ట్ ఇంటర్వ్యూలో యాంకర్ ఈమెనే. ఈమె ఫొటోషూట్లు కూడా చాలా పాపులర్. అలా 'మినీ సెన్సేషన్' అనిపించుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఆమె జాతకం అలానే ఉందంట.
బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లలో అరియానా కూడా ఒకరు. టాప్-7 కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచిన ఈ బ్యూటీ, ఎలాగైనా టైటిల్ విన్నర్ కావాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ సంగతి పక్కనపెడితే.. హౌజ్ లోకి శాంతి అనే ఆస్ట్రాలజర్ వచ్చి, అందరి జాతకాలు చెప్పడం స్టార్ట్ చేశారు.
ఇందులో భాగంగా అరియానాను చూసి ఆమె ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందని చెప్పారు శాంతి. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ లో ఆమె పెళ్లి జరుగుతుందని, వరుడు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడంటూ వెల్లడించారు. ఆమె వైవాహిక జీవితం ఈ ఏడాది నుంచి మొదలవుతుందనేది ఆ జాతకం సారాంశం.
ఈ ఎపిసోడ్ లో అరియానా ముసిముసిగా నవ్వుకొని పక్కకు తప్పుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. సీరియస్ గా కెరీర్ పై దృష్టి పెట్టిన అరియానా, పెళ్లి చేసుకుంటుందంటూ చెప్పించడం సరైనది కాదంటూ ఆమె ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
పెళ్లి బదులు, ఆమె కెరీర్ పై జ్యోతిష్యం చెప్పిస్తే బాగుండేదని అంటున్నారు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో అరియానా పెళ్లి టాపిక్, ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.