Advertisement

Advertisement


Home > Movies - Movie News

'అర్జున్' కు కలిసి వచ్చిన కాలం

'అర్జున్' కు కలిసి వచ్చిన కాలం

మొత్తం మీద అర్జున్ సురవరం సేఫ్ జోన్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. అంతే కాదు, బయ్యర్లకు ఓ రూపాయి డబ్బులు మిగిల్చిన సినిమాగా మిగిలింది.

నిఖిల్ హీరోగా టాగోర్ మధు, ఆకెళ్ల రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా కు విడుదలైన వెంటనే మిక్స్ డ్ టాక్, యావరేజ్ టాక్ వచ్చింది. కానీ చిత్రంగా సినిమా మాత్రం ఫస్ట్ వీకెండ్ తరువాత కూడా ఎక్కడా డౌన్ కాలేదు. అలాగే తొలి వారం తరువాత కూడా మంచి ఫలితాలే నమోదు చేస్తూ వచ్చింది. సరైన సినిమా థియేటర్లలో లేకపోవడం కూడా కలిసి వచ్చింది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో అర్జున్ సురవరం బయ్యర్లు కాస్త లాభాలు కళ్ల చూడ్డమే కాదు, నిర్మాతలు కూడా హ్యాపీ అయ్యారు. ఆలస్యంగా విడుదలయినా, కొన్ని చోట్ల సినిమాను స్వంతగా హోల్డ్ చేసారు. అందువల్ల కాస్త డబ్బులు వచ్చాయి.

మొత్తానికి నిఖిల్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం ఫలించింది. సినిమాను నిలబెట్టడంలో నిఖిల్ పాత్ర కూడా వుంది. విపరీతంగా ప్రచారం చేసాడు నిఖిల్ ఈ సినిమా కోసం. మొత్తం మీద రెండు వారాల ఫలితాలు ఇలా వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?