రష్మిక అదరగొట్టిందిగా

ఆఫ్ ది స్క్రీన్ లో కూడా హుషారుగా వుంటూ, స్టేజ్ మీద చలాకీగా చిందులేయగల హీరోయిన్ రష్మిక. డియర్ కామ్రేడ్ సినిమాకు ఆమె చేసిన ప్రమోషన్లు మరిచిపోలేరు అంత వీజీగా. అలాగే టిక్ టాక్…

ఆఫ్ ది స్క్రీన్ లో కూడా హుషారుగా వుంటూ, స్టేజ్ మీద చలాకీగా చిందులేయగల హీరోయిన్ రష్మిక. డియర్ కామ్రేడ్ సినిమాకు ఆమె చేసిన ప్రమోషన్లు మరిచిపోలేరు అంత వీజీగా. అలాగే టిక్ టాక్ లో, ఇన్ స్టాలో యాక్టివ్ గా వుంటుంది ఆమె. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబో 'సరిలేరు నీకెవ్వరూ' ప్రమోషన్లను రష్మిక వేడెక్కించింది. 

సరిలేరు నీకెవ్వరూ సినిమా నుంచి వారానికి ఓ పాట వంతున వదులుతూ వస్తున్నారు. రాబోయే సోమవారం..'హి ఈజ్ సో క్యూట్' అనే పాట వదలబోతున్నారు. ఈ పాట హుక్ లైన్స్ ను పాడుతూ రష్మిక చేసిన డ్యాన్స్ బిట్ ను సోషల్ మీడియాలో శుక్రవారం విడుదల చేసారు. 

రష్మిక క్రేజీ డ్యాన్స్ ఆమె ఫ్యాన్స్ను, మహేష్ ఫ్యాన్స్ ను అలరించడం ఖాయం. ఇప్పటి వరకు సినిమాలో రష్మిక ఎలా వుంటుందో అన్న చిన్న అనుమానాలు వున్నాయి. ఈ డ్యాన్స్ మూవ్ మెంట్ తో రష్మిక వాటిని పక్కకుతోసేసింది. హుక్ లైన్స్ మాత్రమే వినిపించారు కాబట్టి, పాట ఎలా వుంటుందో అన్నది ఇప్పుడే తెలియదు. మండే వరకు వేచి వుండాల్సిందే.