నాగచైతన్య తమ బ్యానర్లో చేసిన చిత్రాలకి అయినా, వేరే బ్యానర్లలో పని చేసే వాటికి అయినా తండ్రిగా తన కర్తవ్యంగా ప్రమోషన్ చేస్తుంటాడు నాగార్జున. చైతన్య అనే కాదు అక్కినేని ఫ్యామిలీలో ఎవరి సినిమాకి అయినా నాగార్జున మద్దతు ఫుల్‌గా వుంటుంది.
సమంత నటించే చిత్రాలకి కూడా నాగార్జున ప్రమోషన్ మానరు. అలాంటిది చైతన్య తొలిసారిగా తన మేనమామ వెంకటేష్‌తో కలిసి చేసిన చిత్రం గురించి నాగార్జున మాట వరసకి కూడా ఏమీ అనడం లేదు.
వేరే చిత్రాల గురించి ట్వీట్లు పెడుతోన్న నాగార్జున తాను ఇలా 'వెంకీ మామ' పట్ల మౌనంగా వుంటే మీడియాలో ఏమి రాస్తారనేది కూడా లేకుండా ఈ చిత్రం గురించి అస్సలేమీ పోస్ట్ చేయలేదు.
వెంకటేష్‌తో నాగార్జునకి రిలేషన్ అయితే బాగానే వుంది. సురేష్‌బాబుతో కూడా నాగ్‌కి ఎలాంటి సమస్యలు లేవు. మరెందుకని 'వెంకీమామ' విషయంలో నాగ్ మౌనం వహించాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుంటే ఈ చిత్రంలో వెంకీ, చై కలిసి నటించినా కానీ వారి ఇరువురి అభిమానులు మాత్రం మామా అల్లుళ్లని కలిపి ఒక్కటిగా చూడడం లేదు.
వెంకీ మామకి బాగా క్లోజ్ అయిన చైతన్యని దగ్గుబాటి ఫాన్స్ ఓన్ చేసుకోవడం లేదు. దగ్గుబాటి అభిమానులకి ఎలాగో అక్కినేని హీరోలంటే అంతగా పడదు.