రెండు ప్రాంతాలు..రెండు యాసలు..ఒక ప్రేమ

విష్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్ఙున కళ్యాణం. మే నెల మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.  Advertisement రుష్కర్ థిల్లాన్ కథానాయిక.…

విష్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్ఙున కళ్యాణం. మే నెల మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. 

రుష్కర్ థిల్లాన్ కథానాయిక. సూర్యాపేట నుంచి గోదావరి జిల్లాకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడు. అంతా బాగానే వుంది. ఇక పెళ్లే తరువాయి అనే టైమ్ లో ట్విస్ట్. పెళ్లి వద్దనుకునే పెళ్లి కూతురు. కాసిన్ని నవ్వులు, బోలెడు ఎమోషన్లు ఇదీ ట్రయిలర్.

విష్వక్ సేన్ మాస్ ఫన్ పండించడంలో దిట్ట. అతగాడి చేత తొలిసారి క్లాస్ ఫన్ పండించాలని ప్రయత్నించారు. రాముడు మంచి బాలుడు టైపు క్యారెక్టర్ లో కనిపించాడు. దీన్ని విష్వక్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ప్రేమ, భావోద్వేగాలు, మధ్యలో కాస్త మాస్ కలిపి సినిమా కథ అల్లుకున్నట్లు కనిపిస్తోంది.

ఫన్ ఏ మేరకు జ‌నరేట్ చేసారు, ఏ మేరకు వర్కవుట్ అయింది అన్నది ట్రయిలర్ లో క్లారిటీకి రాలేదు. సినిమా చూడాల్సిందే. అయితే ఫ్రేమ్ లు. విజువల్స్ అన్నీ అందంగా వున్నాయి. సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రవికిరణ్ కోలా అందించారు. విద్యాసాగర్ దర్శకుడు. బొగవిల్లి ప్రసాద్, బాపి, సుధీర్ ఈదర నిర్మాతలు.