టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించిన బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. తాజాగా మరో వీడియో విడుదల చేసింది. క్లారిటీ ఇచ్చిన కూడా తనపై అసత్య ప్రచారం చేస్తున్న మీడియాకు వార్నింగ్ ఇస్తూ.. తనపై ప్రచారం చేసిన వీడియోలను డిలీట్ చేయకపోతే వారిపై పరువు నష్ట దావా వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.
అషూ రెడ్డి మాట్లాడుతూ.. కేపీ చౌదరితో వందల కాల్స్ మాట్లాడినట్లు వార్తలు వేస్తున్నారని.. అందులో ఎటువంటి నిజం లేదని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూనే.. అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని.. తన నెంబర్‌ను ప్రచురించేవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. మీడియాలో తన నెంబర్‌ను డిస్‌ప్లే చేయడం వల్ల తనకు వందల కాల్స్ వస్తున్నయంటూ వాపోయారు. మీడియాలో చేస్తున్న ప్రచారం వల్ల తను.. తన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు.
కాగా ఇప్పటికే ఈ కేసులో నటులు సురేఖ వాణి, జ్యోతి కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని అంగీకరించాడు కేపీ చౌదరి. పట్టుబడిన డ్రగ్స్ అన్నీ తను వాడడం కోసమే గోవా నుంచి తెచ్చుకున్నానని, టాలీవుడ్ లో ఎవ్వరికీ తను సరఫరా చేయడం లేదని చెప్పుకొచ్చాడు.