జ‌గ‌న్ స‌ర్కాప్ పై అశ్వినీదత్ సీరియస్ కామెంట్స్!

తమ అను'కుల' నాయకుడు సీఎం కుర్చీలో లేకపోతే ఎంత బాధగా ఉంటుందో అప్పుడప్పుడు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఏ సమావేశంలో అవకాశం దొరికిన జగన్ సర్కార్ పై నోటికి వచ్చింది…

తమ అను'కుల' నాయకుడు సీఎం కుర్చీలో లేకపోతే ఎంత బాధగా ఉంటుందో అప్పుడప్పుడు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఏ సమావేశంలో అవకాశం దొరికిన జగన్ సర్కార్ పై నోటికి వచ్చింది మాట్లాడుతూ చంద్రబాబు కళ్లలో ఆనందం చూస్తుంటారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఆయన జగన్ సర్కార్ పై తన అక్కసును వెళ్లగక్కారు.

సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా రీ రిలీజ్ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వటం మానేశారు కదా, మీరు ఏమైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అవార్డులు ఇప్పిస్తారా అన్న ప్రశ్నకి.. ఆదిశేషగిరి రావు సమాధానం ఇస్తూ.. అది ప్రభుత్వాలు చూడాలన్నారు. అయినా ఇప్పుడు ప్ర‌భుత్వాలు ఇచ్చే అవార్డులకు కూడా అంత విలువ లేదన్నట్టుగా మాట్లాడారు.

అదే సంద‌ర్భంలో అశ్వినీదత్ మైక్ అందుకొని ఏపీలో ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తోందని ‘ఇప్పుడు ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారు. ఇంకా రెండు మూడేళ్ళలో మళ్లీ అవార్డులు అన్నీ సక్రమంగా వస్తాయి’.. అని సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. నంది అవార్డులపై గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభను కాకుండా, కేవలం ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికి, ఒక కులం వారికే అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శలు చేశారు.