కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్. కోటి రూపాయలు దాటిన రెమ్యూనిరేషన్. అసలు డేట్ లు కావాలంటేనే కష్టమయ్యే పరిస్థితి. అలాంటి హీరోయిన్ ను పట్టుకుని, నువ్వు నటించగలవా? అనే విధంగా ఆడిషన్ ఇవ్వమంటే ఎలా వుంటుంది. రెండో మాట లేకుండా నో అంటుంది. అంతే కదా. అదే జరిగింది. కానీ తెలుగు సినిమాకు కాదు. ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు.
బాలీవుడ్ లో అంధాదూన్ లాంటి మాంచి సినిమా అందించిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. అతగాడు తను చేయబోయే సినిమాకు కృతి శెట్టిని అడిగినట్లు తెలుస్తోంది. దానికి కూడా కృతి ఓకెనే అన్నట్లు బోగట్టా. ఎంతయినా బాలీవుడ్ ఎంట్రీ కదా. అందుకే ఎస్ అనడం కామన్. కానీ సమస్య ఎక్కడ వచ్చింది అంటే ముంబాయి వచ్చి షూటింగ్ చేయమనడం కాకుండా ముందు ఆడిషన్ ఇవ్వమన్నారు.
కొత్త హీరోయిన్లు అయితే క్యారెక్టర్ కు సెట్ అవుతారా? లేదా అని ఆడిషన్లు అడుగుతారు. అన్నీ తెలిసి, పాత్రకు సరిపోతాననే అనుకున్న తరువాతే కాంట్రాక్ట్ చేసింది. మళ్లీ కొత్త హీరోయిన్ మాదిరిగా ఆడిషన్ ఏమిటి? అంటూ కృతి ఆ ఆఫర్ ను వదిలేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రతి పెద్ద హీరో సరసన నటిస్తూ వస్తున్న కృతికి ఆ మాత్రం ఆటిట్యూడ్ వుంటుంది. తప్పదు.