దర్శకుడు హరీష్ శంకర్ కు గొప్ప సంకట స్థితి. పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో డ్యూలో వున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సంగీతం దేవీశ్రీప్రసాద్ అని ఎప్పడో ఫిక్స్.
కానీ ఇప్పుడు దేవీ ట్రాక్ రికార్డ్ అస్సలు బాగాలేదు. పుష్ప ముందు వెనుక చూసుకుంటే అంతా శూన్యం అన్నట్లు వుంది పరిస్థితి. లేటెస్ట్ గా వస్తున్న వాల్తేర్ వీరయ్య కు కూడా అద్భుతాలు ఏమీ చేయడం లేదు. జస్ట్ ఓకె. మరి అలా అని ఇప్పుడు పవన్ సినిమాకు దేవీని మార్చడమా? వుంచడమా? ఇదీ హరీష్ డైలమా కావచ్చు.
కానీ మార్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇదే కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చింది. అందువల్ల మార్చడం బాగోదు. గద్దల కొండ గణేష్ టైమ్ లో రీమిక్స్ సాంగ్ దగ్గర తేడా వచ్చింది.హరీష్ శంకర్ అప్పట్లో వేరే ఆప్షన్ ట్రయ్ చేసారు. మరి ఇప్పుడు అదే చేస్తారా? లేక దేవీతోనే వెళ్తారా? అన్నది చూడాలి. ఇప్పటికే దేవీతో కలిసి చాలా ఫొటోలు సొషల్ మీడియాలోకి వదిలారు హరీష్.
అయితే ఫ్యాన్స్ మాత్రం హరీష్-దేవీ కాంబినేషన్ బాగుంటుందని, కచ్చితంగా మంచి పాటలు చేయించుకునే సత్తా హరీష్ కు వుందని నమ్ముతున్నారు. అందుకే హరీష్ కు దేవీ తప్ప మరో ఆప్షన్ లేకపోవచ్చు.